TTD Budget 2021-2022

TTD Budget 2021-2022 : వెంక‌న్న స‌న్నిధిలో భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌!

Spread the love
 • 2021-22 టీటీడీ బడ్జెట్ కు ఆమోదం
 • ఏప్రిల్ 14 నుంచి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌కు అనుమ‌తి
 • గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాల‌ని తీర్మానం
 • టీటీడీ ఉద్యోగులంద‌రికీ కోవిడ్ వ్యాక్సిన్
 • టీటీడీ పాల‌క‌మండ‌లి ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి

TTD Budget 2021-2022 : Tirupathi: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం 2021- 22 బ‌ట్జెట్‌ను రూ.2937.82 కోట్ల‌తో ఆమోదించిన‌ట్టు టీటీడీ ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ తో కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి భ‌క్తుల‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. టీటీడీ ఉద్యోగులంద‌రికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం టీటీడీ పాల‌క‌మండ‌లి స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం మీడియా స‌మావేశంలో ఛైర్మ‌న్ వివ‌రాలు వెల్ల‌డించారు.

 • 2021- 22 ఆర్థిక సంవ‌త్సానికి గాను టీటీడీ బ‌డ్జెట్ రూ.2937. 82 కోట్లుగా ఆమోదించారు.
 • గుడికో గోమాత కార్య‌క్ర‌మానికి దేశ వ్యాప్తంగా వ‌స్తున్న స్పంద‌న వ‌ల్ల గోవును జాతీయ ప్రాణిగా ప్ర‌క‌టించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయాల‌ని తీర్మానించారు.
 • ముంద‌స్తుగా బుకింగ్ చేసుకున్న భ‌క్తుల‌కు ఏప్రిల్ 14వ తేదీ నుంచి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు అనుమ‌తివ్వ‌నున్నారు.
 • ఆర్జిత సేవ‌ల్లో పాల్గొనే భ‌క్తులు కోవిడ్ – 19 నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. సేవ‌కు వ‌చ్చే మూడు రోజుల ముందు కోవిడ్ ప‌రీక్ష చ‌యించుకుని స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాలి.
 • తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో తులాభారం ప్ర‌వేశ పెట్టేందుకు ఆమోదం.
 • టీటీడీ ప‌రిధిలోకి ఇత‌ర ఆల‌యాల‌ను తీసుకోవ‌డానికి విధి విధానాల‌ను నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఇలాంటి ఆల‌యాల‌కు శ్రీ‌వాణీ ట్ర‌స్ట్ నుండి ఆర్థిక స‌హాయం చేయ‌డం జ‌రుగుతోంది.
 • టీటీడీ క‌ళ్యాణ మండ‌పాలు నిర్మాణం, లీజుకు ఇవ్వ‌డం, నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఏక రూప మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌ని నిర్ణ‌యం.
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (సేక‌ర‌ణ ట్విట్ట‌ర్‌)
 • ఉన్న క‌ళ్యాణ మండ‌పాలు స‌క్ర‌మంగా నిర్వ‌హించి న‌ష్టాలు త‌గ్గించుకోవాల‌ని నిర్ణ‌యం.
 • టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ఆరు వేద పాఠ‌శాల‌ల పేరును ఇక‌పై శ్రీ వెంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠంగా మార్చేందుకు ఆమోదం.
 • బ‌ర్డ్ ఆసుప‌త్రిలోని పాత ఓపిడి భ‌వ‌నం, మొద‌టి అంత‌స్థులో శ్రీ వెంక‌టేశ్వ‌ర పీడియాట్రిక్ ఆసుప‌త్రి నిర్మాణానికి సంబంధించి సివిల్‌, ఎల‌క్రిటిక‌ల్‌, ఏసీ త‌దిత‌ర అభివృద్ది ప‌నుల‌కు రూ.9 కోట్ల మంజూరుకు ఆమోదం.
 • కొత్త ఓపిడి భ‌వ‌నంలో మూడో అంత‌స్థు విస్త‌ర్ణ ప‌నుల‌కు రూ.3.75 కోట్ల‌తో టెండ‌ర్ల ఆమోదం.
 • టీటీడీ ప్ర‌సాదాలు, అన్న ప్ర‌సాదాల త‌యారీకి ఉప‌యోగించే నెయ్యి ట్యాంకుల సామ‌ర్థ్యాన్ని ప్ర‌స్తుతం ఉన్న 82.4 మెట్రిక్ ట‌న్నుల నుండి 180.4 మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యానికి పెంచేందుకు ఆమోదం, త‌ద్వారా నెయ్యి నిల్వ‌ల‌ను ఆరు రోజుల నుంచి 14 రోజుల‌కు పెంచుకోవ‌చ్చు.
 • తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి, విశ్రాంతి గృహాలు, స‌త్రాల వ‌ద్ద విద్యుత్ వినియోగానికి సంబంధించి జ‌వాబు దారీ త‌నం పెంచేందుకు AP SPDCL ద్వారా విద్యుత్ మీట‌ర్ల ఏర్పాటుకు ఆమోదం. తిరుమ‌ల‌లో క్ర‌మంగా 50 మెగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీ ఉత్ప‌త్తికి నిర్ణ‌యం.
 • తిరుమ‌ల‌లో ప‌నిచేస్తున్న టీటీడీ ఉద్యోగులంద‌రికీ డాక్ట‌ర్ల సూచ‌న‌లు పాటిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించేందుకు తీర్మానం.
 • త్వ‌ర‌లో ముంబై, జ‌మ్మూలోని శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి భూమి పూజ నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యం.
 • శ్రీ‌వారి మెట్టు మార్గంలో న‌డిచి వచ్చే భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదం అందించాల‌ని నిర్ణ‌యం.
 • అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణ ట్ర‌స్ట్ టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీ‌వారి ఆల‌యం లేదా భ‌జ‌న మందిరం లేదా యాత్రికుల వ‌స‌తి స‌ముదాయంలో వారు ఏది కోరితే అది నిర్మించాల‌ని నిర్ణ‌యం.
 • మీడియా స‌మావేశంలో టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్ జ‌వ‌హార్ రెడ్డి, పాల‌క‌మండ‌లి స‌భ్యులు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, శివ‌కుమార్‌, గోవింద హ‌రి, డిపి అనంత‌, శ్రీ‌రాములు, డాక్ట‌ర్ వాణి మోహ‌న్ పాల్గొన్నారు.

ఇది చ‌ద‌వండి:బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డిన విలేక‌ర్లు అరెస్టు

ఇది చ‌ద‌వండి:ప్ర‌స్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!

ఇది చ‌ద‌వండి:వైభ‌వంగా ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాలు

ఇది చ‌ద‌వండి:పాత్ర‌లో లీన‌మై నిజంగానే చంప‌బోయిండు!

ఇది చ‌ద‌వండి:మ‌ర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

car carsh in home: ఇంటిలోకి దూసుకెళ్లిన ఎర్ర‌చంద‌నం తుంగ‌ల కారు!

car carsh in home శ్రీ‌కాళ‌హ‌స్తి: పోలీసుల‌కు ఎక్క‌డ దొర‌కుతామోన‌ని భ‌య‌ప‌డుతూ కారు డ్రైవింగ్ చేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాన్ని తప్పించ‌బోయి ఓ ఇంటిన Read more

chittoor(Adavi Buduguru): చావు కంటే ముందే అంత్య‌క్రియ‌లు ఏర్పాటు చేసుకున్న వ్య‌క్తి చివ‌ర‌కు?

chittoor(Adavi Buduguru) చిత్తూరు: కొంత మంది ఆత్మ‌హ‌త్య‌లు చాలా బాధ‌ను క‌లిగిస్తాయి. కొంత మంది ఆత్మ‌హ‌త్య‌లు మ‌న‌సును తాకుతాయి. అయ్యో! ఎంత క‌ష్టం వ‌చ్చిందో పాపం..అనే విధంగా Read more

Road accident madanapalle: విషాదం:రోడ్డు ప్ర‌మాదంలో విలేఖ‌రి మృతి

Road accident madanapalle మ‌ద‌న‌ప‌ల్లె: రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ విలేఖ‌రి మృతి చెందిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె మండ‌లంలో బుధ‌వారం చోటు చేసుకుంది. మదనపల్లె Read more

TTD Fake Webistes: టిటిడి టిక్కెట్లు అమ్మే ఫేక్ వెబ్‌సైట్ల‌పై పోలీసుల కొరఢా!

TTD Fake Webistes చిత్తూరు: పోలీసుల దృష్టి వెంక‌న్న స్వామి భ‌క్తుల ప‌రిర‌క్ష‌ణ‌పై పడింది. ఫ‌లితంగా తిరుమ‌ల స్వామివారి ద‌ర్శ‌నానికి టికెట్ల‌ను అమ్ముతాం అంటున్న 39 ఫేక్ Read more

Leave a Comment

Your email address will not be published.