TSRTCహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కేరళలోని శబరిమలైకు వెళ్లే అయ్యప్పస్వాములకు టిఎస్ఆర్టిసి సంస్థ(TSRTC) శుభవార్త తెలిపింది. శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్టు ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే కేరళ రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపామన్నారు. పంబా వద్ద స్పాట్ బుకింగ్ చేసుకుని బస్సులోని భక్తులందరూ ఒకే సమయంలో దర్శనం చేసుకునే సదుపాయాన్ని కల్పించామని వెల్లడించారు.
బస్సును ముందుగానే అద్దె ప్రాతిపదికన బుక్ చేసుకున్న పక్షంలో గురుస్వామితో పాటు ఆరుగురు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సజ్జనార్ పేర్కొన్నారు. బుకింగ్ రద్దు ఛార్జీలను కూడా సవరిస్తున్నట్టు వీసీ సజ్జనార్ ప్రకటించారు. అయితే 48 గంటల కన్నా ముందుగా రద్దు చేసుకుంటే మునుపటి మాదిరిగానే రూ.1000 వసూలు చేస్తారన్నారు. 24 గంటల నుంచి 48 గంటల లోపు రద్దు చేసుకుంటే గతంలో అద్దె మొత్తంలో పది శాతాన్ని మినహాయించేవారు.
ఇక నుంచి రూ.5,000 మాత్రమే మినహాయిస్తారు. 24 గంటల ముందు సమయం నుంచి బయలుదేరే సమయం వరకు రద్దు చేసుకుంటే గతంలో 30 శాతంగా ఉన్న రద్దు ఛార్జీని రూ.10 వేలకు పరిమితం చేశారు. మరింత సమాచారం కోసం 040-30102829 లో లేదా సమీప డిపో మేనేజర్‌ను సంప్రదించాలని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!