TSLPRB PC Exam: తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం జరిగాయి. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రిలిమినరీ రాత పరీక్షకు 8821 మందికి గాను, 8331 మంది హాజరు అయ్యారు. 490 మంది గైర్హాజరు అయ్యారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పర్యవేక్షణలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష(TSLPRB PC Exam) మెదక్ జిల్లాలో మొత్తం 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడగా మెదక్ పట్టణం-17, నర్సాపూర్-05, రామాయంపేట-04, చేగుంట-02 పరీక్ష కేంద్రాల దగ్గర బందోబస్తును ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ రాత పరీక్షను మొట్టమొదటిసారి మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నందున జిల్లా కేంద్రంలోని 28 సెంటర్లలో కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర నోడల్ అధికారి అదనపు ఎస్పీ డా.బి.బాల స్వామి, మెదక్ డిఎస్పీ సైదులు, తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, సంబంధిత సర్కిల్ సిఐలు, ఎస్సైలు, రీజినల్ కో-ఆర్డినేటర్ మెదక్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గణపతి ఆధ్వర్యంలో పేర్కొన్నారు.