ganjai ravana | రూ.2 కోట్లు విలువైన 800 కేజీల గంజాయి అక్రమ రవాణా పత్తి గింజల పొట్టు పశువుల దాణా మాటున జరుగుతుంది. దీనిని పసిగట్టిన శంషాబాద్ ఎస్.ఓ.టి, శంషాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పక్కాగా స్కెచ్ వేసి అక్రమ గంజాయి రవాణా(ganjai ravana)ను పట్టుకున్నారు. కేసుకు సంబంధించి జాయింట్ ఆపరేషన్ వివరాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
సైబరాబాద్ ఎస్ఓటి మరియు శంషాబాద్ పోలీసులు ఆదివారం ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్ Peddlersను అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారు జామున పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), శంషాబాద్ జోన్, శంషాబాద్ పోలీసులతో కలిసి, ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ నుండి బులంద్ పహార్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్కు hyd మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు నిఘా వేసి ముగ్గురు అంతర్రాష్ట్ర DRUG పెడ్లర్స్ నుండి 800 కేజీల గంజాయి, 1 లారీ, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటంన్నీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు. అనంతరం ganjaiని స్వాధీనం చేసుకున్నారు. డిసిపి నారాయణ, శంషాబాద్ ఏసీపీ భాస్కర్, సీఐ వెంకట్ రెడ్డి, సిఐ శ్రీధర్, ఎస్ఐ రవి, రాజేశ్వర్ రెడ్డి, మరియు హెడ్ కానిస్టేబుల్ సత్యం, కానిస్టేబుల్స్ యాదయ్య, రాజు, రాజవర్థన్, ఆంజనేయులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిబ్బందిని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.