Forgery Case : రోగులకు భోజనం పెట్టిన ఓ కాంట్రాక్టర్ ఫోర్జరీ బిల్లులతో కోట్లు కాజేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. పూర్తి వివరాలు..!
Forgery Case : హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ హాస్పిటల్ లో ఫోర్జరీ డైట్ (రోగులకు భోజనం) బిల్లులు పెట్టి రూ.1.20 కోట్లను కాజేశాడు ఓ కాంట్రాక్టర్. అప్రమత్తమైన ఆసుపత్రి సూపరింటెండెంట్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిలోఫర్ హాస్పిటల్ లో డైట్ కాంట్రాక్టర్ అయిన కొడూరి సురేష్ బాబు ఆసుపత్రి సిబ్బంది అవసరానికి అనుగుణంగా రోగులకు ఆహారం సరఫరా చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకోని నకిలీ ఇండెంట్లను (మెస్ బిల్లుల రసీదు) అధిక ప్రోటీన్, డైట్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించాడు. ఈ నకిలీ ఇండెంట్ల సహాయంతో ఆయన ప్రభుత్వానికి రూ.1.20 కోట్లు నష్టం కలిగించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదుతో కాంట్రాక్టర్ కొడూరి సురేష్ పై క్రైం నెం. 98/2021, 403, 406, 420, 465, 468, సిసిఎస్ 471 ఐపిసి.హైడ్ పలు సెక్షన్ల కింద కేసున నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!