TS Newsవరంగల్: తన భూమిలో అక్రమంగా బోరు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ వికలాంగుడు. పూర్తి వివరాల ప్రకారం.. కాశిబుగ్గ కు చెందిన వికలాంగుడైన సయ్యద్ అసద్ కు సంబంధించిన భూమిపై కోర్టు ఇచ్చిన తీర్పు జడ్జిమెంట్ తప్పుదోవ పట్టించారని బాధితుడు పేర్కొన్నారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని మార్కండేయ అనే వ్యక్తి మున్సిపల్ అధికారుల సపోర్ట్ తో అక్రమంగా తన భూమిలో బోరు వేశారని ఆవేదన వ్యక్తం (TS News)చేశారు.
వికలాంగుడిగా పుట్టడమే పాపమా..? అంటూ కోర్టు ఇచ్చిన తీర్పు జడ్జిమెంట్ ని పట్టించుకోకుండా తన భూమిలో అక్రమంగా బోర్ వేయడమే కాకుండా తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. తనను వికలాంగుడని కూడా చూడకుండా నన్ను ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు.
ఏసీబీ అధికారులకు(ACB telangana) చిక్కిన అవినీతి తిమింగలం


హనుమకొండ జిల్లాలో ధర్మసాగర్లో ఏసీబీ అధికారులకు ఓ అవినీతి తిమింగలం మంగళవారం చిక్కింది. టెక్నికల్ అసిస్టెంట్ యాదగిరి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. NREGS కింద నువ్వుల పంట మెయింటెన్స్ బిల్లు కోసం రైతు మజ్జిగ లింగయ్యను రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?