Vaccination: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న అన్ని విద్యా సంస్థలలో 100 శాతం వ్యాక్సినేషన్ జరగాలని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యా సంస్థల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
విద్యా సంస్థల్లో వంద శాతం వ్యాక్సినేషన్ (Vaccination)పూర్తయితే ప్రత్యేకంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధానోపాధ్యాయులు పీహెచ్‌సీలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. వ్యాక్సినేషన్ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ఈ నెల 10వ తేదీ నాటికి 100 శాతం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించింది.
సంబంధిత శాఖల అధికారులు వ్యాక్సినేషన్‌పై క్షుణ్ణంగా సమీక్షించి, రోజు వారీగా నివేదికలు అందజేయాలని అని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!