TRS Plenary Meeting: హైదరాబాద్ : ‘ఇవాళ కొంత మంది ఎగిరెగిరి పడుతుననారు.. టి- కాంగ్రెస్, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు పదవులు వచ్చాయంటే కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. నగరంలోని జలవిహార్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్యామా అని పదవులు రాగానే గంజిలో ఈగల్లాగా ఎగిరిపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. చిల్లల మాటలు మాట్లాడుతున్నారని వయసులో మీ కంటే 20 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లరగాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. పేరుకే ఢిల్లీ పార్టీలు(TRS Plenary Meeting) కానీ.. చేసేవి చిల్లర పనులు అని ధ్వజమెత్తారు. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.


60 లక్షల పై చిలుకు సభ్యులతో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నామని, మొన్న ఢిల్లీలో తెలంగాణ భవన్కు భూమి పూజ చేసుకున్నామన్నారు. ఇప్పుడు మన ముందు ఏ ఎన్నికా లేదని, హుజూరాబాద్ ఎన్నిక సమస్యనే కాదు.. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దాని కోసం సైన్యం ఉంటే సరిపోదని, ఇందుకు ఎక్కడికక్కడ కమిటీలు పటిష్టంగా ఉండాలన్నారు.
గల్లీ టు ఢిల్లీ గులాజీ జెండా కే జై..!
గల్లీ టు ఢిల్లీ గులాబీ జెండాకే జైకొడుతున్నారన్నారు. 2014లో 63 సీట్లు, తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12769 గ్రామ పంచాయతీలు గానూ 10 వేల గ్రామాల్లో గులాబీ జెండాలు ఎగిరాయన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ 32 జడ్పీలను కైవసం చేసుకున్నామన్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారన్నారని కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారన్నారు.


పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లను కట్టబెట్టారని 142 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 135 మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను రెపరెపలాడించారన్నారు. ఈ ఏడేండ్లలో టిఆర్ఎస్ పార్టీ ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. పత్రికల్లో హెడ్లైన్స్కోసం, పైశాచిక ఆనందం కోసమే ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. వారిని ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!
పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని తప్పకుండా గౌరవించకుంటామన్నారు. పదవులు రాక కొంత మంది నిరాశతో ఉన్నారని త్వరలోనే 500 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కో ఆప్షన్ సబ్యులను నియామకం కూడా పూర్తి చేస్తామన్నారు. పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు. బస్తీ, డివిజన్ కమిటీలకు ఇచ్చే ప్రాధాన్యతను సోషల్ మీడియా కమీటీలకు ఇవ్వాలననారు.


సోషల్ మీడియా కమిటీలకు కూడా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇతర ఏ పార్టీకి లేని విధంగా ఒక కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుందామని కేటీఆర్ తెలిపారు. దసరా, దీపావళి తర్వాత కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తామని కేటీఆర్ అన్నారు.
ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు పాల్గొన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!