TRS Party హన్మకొండ: అధికార టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుందా…హన్మకొండలో పార్టీ కేడర్లో రాజీనామాల వంతు మొదలైందా? అంటే(TRS Party) అవుననే సమాధానం వినిపిస్తోంది. శాయంపేట మండల సర్పంచులు స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్ పర్సన్, స్థానిక ఎంపీపీ తీరుపట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ రాజీనామా నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలోని 22 మంది అధికార పార్టీలో ఉన్నారు. వీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని అనుకున్నట్టు ప్రాథమిక సమాచారం.
గత కొంత కాలంగా అధికార పార్టీ ఎంపీపీ ఆధిపత్యం ఎక్కువ కావడంతో పాటు గ్రామాల్లో నెలకొన్ని సమస్యలపై స్పందించకపోగా సమావేశాల్లో తెలుపడానికి అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ఓ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక సమావేశం చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉండి ప్రాధాన్యత, అవకాశాలు లేనప్పుడు ఎందుకు పార్టీలో ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక పదవులకు రాజీనామా చేసేదొక్కటే మార్గమని నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రజల కోరిక మేరకు నడుచుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి మిగతా జిల్లాల్లోని కూడా ఇదే అవలంభిస్తే టిఆర్ఎస్కు గడ్డు కాలమే అంటున్నారు నిపుణులు. సీనియర్ రాజకీయ నాయకులు. చుద్ధాం మున్ముందు ఇంకా ఏం జరిగుతుందో..!!
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!