Narappa Amazon Prime Release: విక్టరీ వెంకటేష్, ప్రియమణి ముఖ్యపాత్రల్లో నటించిన నారప్ప సినిమా ఈ నెల 20వ తేదీన OTT Platforms మీద విడుదలైంది. అయితే సినిమా విడుదలపై సోషల్ మీడియాలో పలు విధాలుగా ట్రోల్ అవుతుంది. ముఖ్యంగా సినిమా ఓనర్లకు నిరాశే మిగిలింది అనే విధంగా ట్రోల్ నడుస్తోంది. టాలీవుడ్లో అగ్రహీరోల్లో ఒకరైన హీరో విక్టరీ వెంకటేష్ సినిమాలంటే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వెంకటేష్ నటించిన ఏ సినిమాలైనా కుటుంబ సభ్యులు అంతా కలిసి చూసే విధంగా ఉంటాయి. అంతే కాకుండా కామెడీ, సెంటిమెంట్, కుటుంబ నేపథ్యం లాంటి సన్నివేశాల్లో హీరో వెంకటేష్ తనకు తానే సాటి అని చెప్పవచ్చు.
ప్రస్తుతం నారప్ప సినిమా కరోనా ప్రభావం వల్ల సినిమా థియోటర్లలో విడుదల కాలేకపోయింది. గతేడాదే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న నారప్ప మూవీ థియోటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావం అప్పటి నుంచి మొదలై పెరిగిపోవడంతో మళ్లీ లాక్డౌన్ వచ్చింది. సినిమా హాళ్ళు మొత్తం మూతపడ్డాయి. ఇక చేసేది ఏమీ లేక Amazon Prime లో విడుదల అయ్యింది. ఈ సందర్భంగా సినిమా థియేటర్ల యాజమాన్యాన్ని కరోనా పెద్ద ఎత్తున దెబ్బ తీసింది. గత రెండు సంవత్సరాలుగా కరోనా దెబ్బతో థియోటర్లన్నీ మూతపడ్డాయి. కాస్త కుదుట పడిందన్న సమయంలో థియేటర్లు తెరుచుకుందామనుకుంటే కరోనా నిబంధనలు కఠినంగా మారాయి.
OTT Platforms కు కరోనా కోట్ల లాభం తెచ్చింది. షూటింగ్ అయిపోయిన వెంటనే సినిమాను కొనడం ఓటిటిలో విడుదల చేయడంతో థియేటర్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలే కరోనా సమయం కావడంతో అందరూ ఇళ్లకే పరిమితమై ఆన్లైన్ ద్వారానే కొత్త సినిమాలను చూస్తున్నారు. నారప్ప కూడా అదే విధంగా ఆన్లైన్( Narappa Amazon Prime Release ) ద్వారా చూస్తున్నారు. గతంలో నారప్ప సినిమాను థియోటర్లలోనే విడుదల చేయాలని థియేటర్ల యాజమాన్యం నిర్మాతను కోరినప్పటికీ అప్పటికే ఓటిటి ప్లాట్‌ఫాంకు అమ్మినట్టు చెప్పేశారు.


ఇంత పెద్ద అగ్ర హీరో సినిమా థియేటర్లలోకి రాకుండా చేసిన కరోనాపైన థియేటర్ల యాజమాన్యాలపై యూట్యూబ్‌లో TROLLERS ADDA 2.0 Youtube Channel ద్వారా కాస్త ఫన్నీగా వీడియో వైరల్ అవుతుంది. ఇందులో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలపైనా, నిర్మాత డి.సురేష్బాబుపైన, హీరో వెంకటేష్‌పైన, కరోనాపైన,
సినిమా థియేటర్ల యాజమాన్యంపై ఫన్నీగా ట్రోల్ నడుస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాము. మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
Video link : TROLLERS ADDA 2.0 Youtube Channel
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్