Trending News April 19: ఇండియాలో జరిగిన కొన్ని వైరల్ వార్తలు ఇక్కడ చదవండి. తాజా సమాచారంతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వార్తలు తీసుకొస్తుంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అందుబాటులో ఉంటుంది.
Trending News April 19
Kerala: ఇద్దరు పురుషులు ఒకే స్కూటర్లో ప్రయాణించొద్దట
ద్విచక్ర వాహనంపై వెనుక సీటులో పురుషులు కూర్చోవడంపై కేరళలోని పాలక్కడ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రేపటి వరకు నిషేధం విధించారు. ఈ రూల్ నుంచి పిల్లలు, మహిళలను మినహాయించారు. ఈ నెల 15న SDPI కార్యకర్త హత్య జరిగింది. దానికి ప్రతీకారంగా RSS కార్యకర్త శ్రీనివాసన్‌ను ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి హత్య చేశారు. ఇదే తరహాలో మరిన్ని హత్యలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Tamilasai: నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ను కాదు
తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ స్పందించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం పెద్ద సవాల్‌గా పేర్కొన్నారు. సీఎం చెప్పారని ఫైలుపై సంతకం చేయడానికి నేను రబ్బర్ స్టాంబ్ గవర్నర్‌ను కాదు. ఢిల్లీ వెళ్లిన వెంటనే నాపై అసత్య ప్రచారం మొదలుపెట్టారు. గవర్నర్‌ని అని కూడా చూడకుండా విమర్శిస్తున్నారు. నన్ను వేరే రాష్ట్రానికి మారుస్తారనేది నిజం కాదు అని గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు.
Uttar Pradesh: పెళ్లిలో వరుడి చెంప పగలగొట్టిన వధువు
ఇటీవల పెళ్లిళ్ల వధువులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆ దాడులు కూడా చేసుకోబోయే అమ్మాయిలు చేయడం మరో సంచలనంగా మారింది. తాజాగా ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో ఓ వధువు కళ్యాణ మండపంలోనే వరుడి చెంప పగలగొట్టింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హామీర్పూర్లో జరిగింది. అందరి బంధువుల సమక్షంలో మొదట అబ్బాయి, అమ్మాయి మెడో దండ వేశాడు. వెంటనే అమ్మాయి 4 సార్లు అతని చెంపవాయించి స్టేజీ దిగి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.
SC అనే కారణంతో ఆలయంలోని రానివ్వలేదు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమపీంలోని ఓ గ్రామంలో పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పెళ్లి కొడుకుని ఆలయంలోకి రాకుండా ఆలయం మూసేశారు. ఎస్సీ అనే కారణంతోనే కొందరు తమ పలుకుబడి ఉపయోగించి ఆలయం మూసేశారని షెడ్యూల్డ్ కులాల సంస్థ ఫిర్యాదు చేసింది. కాగా ఆ ఆలయాన్ని రాజ్‌పుత్ కమ్యునిటీ వాళ్లు నిర్మించారని, పూజారి కుటుంబ సభ్యుడు మరణించినందునే ఆలయం మూసివేసినట్టు పోలీసులు తెలిపారు.
indian armyలో ఇంటి దొంగలు
భారత సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానస్పద సంబంధాలు కలిగి ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. సైన్యంలో సైబర్ సెక్యురిటీ ఉల్లంఘన జరిగింది. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం వెళ్లింది. పొరుగు దేశాల గూఢచర్య కార్యకలాపాలతో ఇది ముడిపడి ఉండొచ్చు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాం. దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు తప్పవు అని ఉన్నతాధికారులు తెలిపారు.
UP: ఘోరంగా కొట్టి కాళ్లు నాకించారు
యూపిలో రాయ్‌బరేలిలో ఓ దళితుడిని కొంతమంది ఘోరంగా కొట్టి అతని చేత కాళ్లు నాకించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. మరో వీడియోలో ఆ బాధిత వ్యక్తి మారజునా(మత్తుపదార్థం) అమ్ముతున్నాడంటూ నిందితులు ఆరోపించగా అతను ఒప్పుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ