Trainee Pilot Mahima | స్వశక్తితో ఎదిగి తనకంటూ గుర్తింపు సాధించుకోవాలనుకున్న ఓ మహిళ కల చెదిరింది. మహిళా పైలట్‌గా రాణించాలన్న ఆమె ఆశను, విధి అడియాశ చేసింది. నల్గొండ జిల్లాలోని శిక్షణ విమానం నేలకూలి తమిళనాడుకు చెందిన మహిమ మృతి చెందింది. ఈ ఘటన దురదృష్టకరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోందని (Trainee Pilot Mahima) తెలిపారు.
నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి మండలం పెద్దవూరులో శిక్షణ విమానం కూలి మహిళా ఫైలెట్ మృతి చెందారు. తమిళనాడుకు చెందిన గజరాజు కుమార్తె మహిమ నాగార్జున సాగర్ సమీపంలోని విజయపురి సౌత్ ఏరియేషన్ అకాడమీలో ఫైలట్‌గా శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా శిక్షణ విమానం సెస్నా 152 డబుల్ సీటర్‌లో ఉదయం 10.30 గంటలకు బయలు దేరారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో పెదవూర గ్రామం పరిధిలో రామన్నగూడెం తండాలో విమానం అదుపు తప్పి వ్యవసాయ పొలాల్లో కుప్ప కూలింది.
భారీ శబ్ధంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. విమానం పూర్తిగా ముక్కలు కాగా, మహిమ మృతదేహాం పూర్తిగా చిద్రమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ, వైద్య అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిమ మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించారు. విమానం ఘటనపై పోలీసుతో పాటు డిసిజిఐ విచారణ చేపడుతోందని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!