trailing stop loss

trailing stop loss:ట్రైలింగ్ స్టాప్‌లాస్ ఎలా ఉప‌యోగించాలి? | stock market

stock market course
Share link

trailing stop loss: ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మ‌నం తీసుకున్న Stock Price పెరుగుతూ లాభం పొందుతున్న‌ప్పుడు మ‌న‌కు వ‌చ్చిన లాభాన్ని నిలుపుకుంటూ, మ‌రికొంత లాభం స్టాక్ ప్రైస్ పెరుగుద‌ల వ‌ల్ల పొంద‌డానికి ఉప‌యోగ‌ ప‌డుతుంది. మ‌నం ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉప‌యోగించ‌నిచో కొన్ని సార్లు మ‌న‌కు వ‌చ్చిన లాభం మొత్తం పోయి న‌ష్టం కూడా వ‌చ్చే అవ‌కాశం క‌ల‌దు. కావున లాభం వ‌స్తున్న‌ప్పుడు అతి త‌క్కువ లాభాల‌తో మ‌నం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఇంకా లాభం పొంద‌డానికి అవ‌కాశం ఉన్న‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించాలి.

trailing stop loss ప‌ద్ధ‌తి

మార్కెట్‌లో చాలా మంది అతి త‌క్కువ లాభాల‌తో బ‌య‌ట‌ప‌డుతూ, న‌ష్టం వ‌స్తే మాత్రం ఎంత కాల‌మైన ఆ స్టాక్‌ల‌ను అలాగే అట్టిపెట్టుకుని ఎదురుచూస్తుంటారు. కానీ, మీరు ఎప్పుడు కూడా న‌ష్టం వ‌స్తున్న స్టాక్‌ను త్వ‌ర‌గా వ‌దిలించుకొని, లాభం వ‌స్తున్న స్టాక్‌ను ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉప‌యోగించి మీ వ‌ద్ద‌నే ఉంచుకోవాలి. ఇక్క‌డ మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్‌ను ఏ విధంగా ఉప‌యోగించుకోవాలో వివ‌రంగా తెలుపుతాము. ఈ ప‌ద్ధ‌తిలో మీరు స్టాక్ కొన్న త‌రువాత మీ స్టాప్ లాస్ ప్రైస్‌ను సాధార‌ణంగా ఆ రోజు Stock యొక్క‌లో ప్రైస్ లేదా అంత‌కు ముందు రోజులో ప్రైస్ ల‌లో రెండింటిలో ఏది త‌క్కువ ఐతే దానిని వాడ‌వ‌లెను. దీనిని మీరు ప్ర‌తి రోజు మార్కెట్ ముగింపు త‌ర్వాత గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఎప్పుడూ పైకి పెరుగుతుండాలి

Day One లో మీరు స్టాక్ కొన్న రోజు అన‌గా ప్ర‌స్తుత రోజు అనుకోండి. డే2లో మీ Stop Loss ఒక్క‌సారి గుర్తు చేసుకోండి. ఆ రోజు స్టాక్ యొక్క‌లో ప్రైస్ లేదా ముందు రోజులో ప్రైస్‌ల‌లో ఏది త‌క్కువ అయితే అది మ‌న స్టాప్ లాస్‌, ఇమేజ్‌లో స్టాప్ లాస్‌ను మార్క్ చేయ‌డం గ‌మ‌నించండి. డే3లో మీ స్టాప్ లాస్‌ను ఒక్క‌సారి గుర్తు చేసుకోండి. ఒక విష‌యం గుర్తుంచుకోండి. మీ స్టాప్ లాస్ ఆర్డ‌ర్ లాంగ్ పొజిష‌న్స్‌కి ఎప్పుడూ పైకి పెరుగుతుండాలి. 4వ రోజు వ‌ర‌కు మీరు మంచి లాభాల‌లో ఉన్నారు. ఇప్ప‌టికీ కూడా మీ స్టాప్ లాస్ బాగా ని చేస్తుంది.

5వ రోజు క‌ల్లా మీరు మంచి లాభాల‌లో ఉన్నారు. కానీ స్టాక్ ప్రైస్ ఇంత‌కు ముందు గ‌ల హైప్రైస్ వ‌ద్ద‌కు చేరుకుంటుంది. ఇప్పుడు మీకు అప్పుడు మీ స్టాక్ ప్రైస్ కు రెసిస్టెన్స్ రాగ‌ల‌దు. అక్క‌డి నుండి ప్రైస్ కింద‌కి ప‌డిపోగ‌ల‌దు. అని అనుకుంటున్నారు కానీ ఆ విష‌యం నిర్థార‌ణ కాలేదు కావున‌, మీ ట్రైలింగ్ స్టాప్ లాస్‌ను పాటించండి. ఈ రోజు కూడా మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ బాగా ప‌ని చేస్తుంది. ఈ రోజు మ‌న ట్రైలింగ్ లాస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం స్టాప్ లాస్ హిట్ కావ‌డం జ‌రిగిన‌ది. ట్రైలింగ్ స్టాప్ లాస్ నియ‌మం ఏమిటంటే? ఆ రోజు స్టాక్ యొక్క లో ప్రైస్ లేదా అంత‌కు ముందు రోజులో ప్రైస్‌ల‌లో రెండింటిలో ఏది త‌క్కువ అయితే దానిని ట్రైలింగ్ స్టాప్ లాస్‌గా వాడ‌వ‌లెను. ఈ నియ‌మం ప్ర‌కారం మ‌న స్టాప్ లాస్ హిట్ కావ‌డం జ‌రిగిన‌ది.

stock market

మీరు trailing stop loss ప‌ద్ధ‌తి ఉప‌యోగిస్తున్న‌ప్పుడు రెసిస్టెన్స్ వ‌ద్ద‌కు ప్రైస్ వ‌చ్చిన‌ప్పుడు మీ వ‌ద్ద గ‌ల స్టాక్స్‌ల‌ను మొత్తం అమ్మ‌కుండా స‌గం మాత్ర‌మే అమ్మి మిగిలిన స‌గానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడ‌వ‌లెను. ఒక వేళ మీరు కొన్న స్టాక్ అండ్ ట్రెండ్ ప్రారంభ ద‌శ‌లో ఉన్న‌ట్టు అయితే కొంత దూరంలో స్టాప్ లాస్ పోగొట్టుకోవ‌డం వ‌ల్ల మీరు ట్రెండ్‌ను మిస్ కాకుండా ఉంటారు. మీరు ట్రెండ్‌ను గుర్తించ‌గ‌లిగే నేర్పు రావాలి. అంటే టెక్నిక‌ల్ నేర్చుకోండి.

See also  News Indian Stock Market: నాటో యుద్ధం స‌మాచారంతో బెంబేలెత్తుతున్న‌ స్టాక్ మార్కెట్లు

Leave a Reply

Your email address will not be published.