the PRC committee

the PRC committee: పీఆర్సీ క‌మిటీ సిఫార్సు చేసిన వేత‌నాలు అమ‌లు చేయాల్సిందే!

Spread the love

the PRC committee: పీఆర్సీ క‌మిటీ సిఫార్సు చేసిన వేత‌నాలు అమ‌లు చేయాల‌ని ప‌లు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప‌నికి త‌గ్గ వేత‌నం రాక‌పోవ‌డంతో కార్మికుల జీవితాలు దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.


‌the PRC committee: ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి పీఆర్సీ క‌మిటీ సిఫార్సు చేసిన వేత‌నాలు అమ‌లు చేయాల‌ని మున్సిప‌ల్ కారి్మ‌కుల‌ను నాల్గో త‌ర‌గ‌తి ఉద్యోగులుగా గుర్తించాల‌ని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు, ఐఎన్‌టియుసి మున్సిప‌ల్ కార్మిక సంఘాల నేత‌లు డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం స్థానిక సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో మున్సిప‌ల్ కార్మికుల ముఖ్యుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో సిఐటియు ఖ‌మ్మం జిల్లా అధ్య‌క్షులు తుమ్మా విష్ణువ‌ర్థ‌న్‌, మున్సిప‌ల్ తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ స్టాఫ్ మ‌రియు ఔట్ సోర్సింగ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ (ఎఐటియుసీ) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు, తెలంగాణ ప్ర‌గ‌తి శీల మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్‌(ఐఎఫ్‌టియు) తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు జి.రామ‌య్య‌, ఐయ‌న్‌టియుసి ఖ‌మ్మం న‌గ‌ర కార్య‌ద‌ర్శి సిహెచ్‌.విప్ల‌వ్ కుమార్ లు మాట్లాడారు.

మున్సిప‌ల్ రంగంలో పారిశుధ్యం, గార్డెన్‌, వాట‌ర్ స‌ప్ల‌య్‌, ఎల‌క్ట్రిక‌ల్ , ఇంజ‌నీరింగ్‌, జ‌వాన్లు, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్లు, డ్రైవ‌ర్లుగా ప‌నిచేస్తున్న కార్మ‌కుల వేత‌నాలు పెంపుద‌ల, పే క‌మీష‌న్ త‌దిత‌ర వాటిపై ప‌లువురితో చ‌ర్చించి అనేక విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని త‌మ సిఫార్సులు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇచ్చామ‌న్నారు. పే క‌మీష‌న‌ర్ రాష్ట్రంలో ప‌నిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ కార్మికుల‌కు గ్రూప్ – 4లో ప‌నిచేస్తున్న వారికి రూ.19 వేలు, గ్రూప్ – 3లో ప‌నిచేస్తున్న వారికి రూ.22,900 , గ్రూప్ – 3 (ఎ) లో ప‌నిచేస్తున్న వారికి రూ.31,000 వేలు సిఫార్సు చేసింద‌ని తెలిపారు. పే క‌మీష‌న్ కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ జీతాల‌తో పాటు సంవ‌త్స‌రానికి వెయ్యి రూపాల‌యు ఇంక్రిమెంట్ రూపంలో చెల్లించాలంద‌ని అన్నారు. ప‌ర్మినెంట్ కార్మికుల‌తో స‌మానంగా సెల‌వులు ఇఎస్ఐ, పిఎఫ్ అమ‌లు చేయాల‌ని చెప్పింద‌న్నారు.

పే క‌మీష‌న్ సుప్రీం కోర్టు మ‌రియు రాష్ట్ర హైకోర్టు స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం చెల్లించాల‌ని ఇచ్చిన తీర్పుల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని త‌న సిఫార్సులు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని క‌మీష‌న్ రిపోర్టులో తెలియ‌జేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. పే క‌మిష‌న్ సిఫార్సుల‌ను అమ‌లు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం మున్సిప‌ల్ కార్మికుల‌కు క‌నీస వేత‌నం రూ.20 వేలు అమ‌లు చేసి చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయ‌కులు

ఈ స‌మావేశంలో సిఐటియు మున్సిప‌ల్ యూనియ‌న్ న‌గ‌ర అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శులు దొడ్డా న‌ర్సింహారావు, బి.ప్ర‌సాద్‌, ఐఎఫ్‌టియు డివిజ‌న్ కార్య‌ద‌ర్శి ఆడెపు రామారావు, ఎఐటియుసి మున్సిప‌ల్ న‌గ‌ర నాయ‌కులు షేక్ హుస్సేన్‌, బి.పాపారావు, ఐఎన్‌టియుసి మున్సిప‌ల్ కార్మిక సంఘం న‌గ‌ర అధ్య‌క్షులు ఎం.జ‌య‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Rajasthani lady gang: ఖ‌మ్మంలో ప్ర‌త్య‌క్ష‌మైన రాజ‌స్థాన్ అమ్మాయిల బ్యాచ్ ! హైవేల‌పై డ‌బ్బులు వ‌సూళ్లు!

Rajasthani lady gang: ఖ‌మ్మం: మ‌రోసారి హైవేపై అమ్మాయిల్ హ‌ల్ చ‌ల్ సృష్టించిన సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో క‌నిపించింది. వ‌చ్చీ పోయే వాహ‌నాల‌న్ని ఆపుతూ డ‌బ్బులు దండుకుంటున్నారు. Read more

khammam New Bus Stand opening | ఖ‌మ్మం పాత బ‌స్టాండ్‌పై పెద్ద‌ల క‌న్ను: అఖిల‌ప‌క్షం

khammam New Bus Stand opening: Khammam: కోట్లు విలువైన ఖ‌మ్మం పాత బ‌స్టాండ్‌పై కొంద‌రు పెద్ద‌లు క‌న్ను వేశార‌ని, ఖ‌మ్మం పాత బ‌స్టాండ్ ను సిటీ Read more

AITUC : జిన్నింగ్ మిల్ కార్మికుల‌కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఎఐటియుసి ఆధ్వ‌ర్యంలో జెండా ఆవిష్క‌ర‌ణ‌ AITUC : జిన్నింగ్ మిల్ కార్మికుల‌కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిKhammam: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం జిన్నింగ్ మిల్ హ‌మాలీ కార్మికుల‌కు Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Leave a Comment

Your email address will not be published.