Tractor tyre burst : Srikakulam: ఓ ట్రాక్టర్ టైరుకు గాలి కొడుతుండా భారీ శబ్ధంతో పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జలుమూరు మండలం కొమనాపల్లి గ్రామంలో దాసరి సూర్యనారాయణ(52) గత 30 ఏళ్లుగా కొమనాపల్లి కూడలి వద్ద పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. అలాగే, సైకిల్ రిపేరింగ్, వాహనాలకు గాలి కొడుతుంటాడు.
గత రాత్రి ఆదివారం దుకాణం మూసివేస్తున్న సమయంలో తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద(45) ట్రాక్టర్ టైరు తీసుకొచ్చాడు. పంక్చర్ వేసి గాలి కొట్టమని కోరాడు. మరమ్మతు పూర్తయిన అనంతరం సూర్యనారాయణ గాలి కొడుతున్నాడు. అదే సమయంలో టైరు భారీ శబ్ధంతో పేలిపోయింది. దీంతో సూర్యనారాయణ, గోవింద ఇద్దరూ అమాంతం గాల్లోకి పైకెగిరిపడ్డారు. ఈ ఘటనలో సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన గోవిందను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ఇది చదవండి:రూ.500 కే టివీ అంట..ఆరా దీస్తే!
ఇది చదవండి:సగటు వాలంటీర్ లోపల ఆవేదన ఇదేనేమో!?
ఇది చదవండి:వత్సవాయి : టిడిపి కార్యకర్త వాహనానికి నిప్పు!
ఇది చదవండి:దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:చాపకింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!
ఇది చదవండి:పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతం