Tractor engine overturns, the farmer killed
Chittoor News: ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి రైతు దుర్మరణంChittoor: పొలం దున్నుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇంజిన్ కింద ఇరుక్కుపోయి రైతు దుర్మరణం చెందాడు. ఈ ఘటన తంబళ్లపల్లె మండలంలోని చింపిరివాండ్లపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సహదేవి తెలిపిన వివరాల ప్రకారం. చింపిరివాండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులురెడ్డికి నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది.
ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఆ ట్రాక్టర్ తో తన వ్యవసాయ భూములను దున్నుకుంటూ, ఇతరుల పొలాలకు కూడా వెళ్లేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన జగన్నాథరెడ్డి పొలం దున్నేందుకు వెళ్లిన రైతు శ్రీనివాసులురెడ్డి పనులు ముగించుకొని ఇంటికొచ్చేందుకు పొలం మడిలో నుంచి ట్రాక్టర్‌తో బయటకు వస్తున్నాడు. అలా వస్తుండగా పొలం గట్టు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. పొలం రైతులు కేకలు వేయడంతో సమీప వ్యవసాయ పొలాల్లో ఉన్న రైతులందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే మృతి చెందిన శ్రీనివాసులురెడ్డి మృతదేహాన్ని జేసీబీ సహాయంతో ట్రాక్టర్ కింద నుండి వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య జోష్న, కుమార్తె దీపిక, కుమారుడు దిలీప్ ఉన్నారు. కేఉ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తంబళ్లపల్లె ఎస్ఐ సహదేవి తెలిపారు.
ఇది చదవండి: సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు
ఇది చదవండి: గిరిజన, మైనింగ్ యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలి: రాణి రుద్రమ రెడ్డి
ఇది చదవండి: గర్భంలోని శిశువు మాయమైదంటూ మహిళ ఆందోళన