Lawyer couple murdered case

Lawyer couple murdered case : హ‌త్య‌లు వెనుక టిఆర్ఎస్ పాత్ర: ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి

Spread the love

Lawyer couple murdered case : Hyderabad: మంథ‌ని న్యాయ‌వాదులు గ‌ట్టు వామ‌న్‌రావు, నాగ‌మ‌ణిల‌ను హ‌త్య చేయ‌డం దారుణమ‌ని టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. న్యాయం కోసం పోరాడే పేద కుటుంబం నుండి వ‌చ్చిన వారిని చంప‌డం అత్యంత హేయ‌మైన చ‌ర్య అని అన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చింది రాష్ట్రాన్ని దోచుకునేందుకేన‌ని విమ‌ర్శించారు. శాండ్ ల్యాండ్ మైన్‌, వైన్తో దోపిడీతో పాటు ఇప్పుడు హ‌త్య‌ల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని అన్నారు. అది క‌చ్చితంగా టిఆర్ఎస్ చేసిన హ‌త్యేన‌ని ఆరోపించారు. కేసీఆర్ ఈ హ‌త్య‌ల‌ను క‌నీసం ఖండించ‌డంలేద‌ని పేర్కొన్నారు.

పోలీసులు కూడా పింక్ ష‌ర్ట్ వేసుకున్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. హ‌త్య‌గావించ‌బ‌డిన న్యాయ‌వాద దంప‌తులు శీలం రంగ‌య్య లాక‌ప్ డెత్‌పై హైకోర్టులో న్యాయ‌పోరాటం చేస్తున్నార‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ హ‌త్య‌పై సీఎం స్పందించ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హోంమంత్రి పూర్తిగా డ‌మ్మీగా మారార‌ని ఆరోపించారు. ఇసుక వ్యాపారాల‌కు అడ్డొస్తే తొక్కి చంపేశార‌ని, ఇప్పుడు ద‌ళిత వ్య‌క్తి లాక‌ప్ డెత్‌పై కేసు వేస్తే వీరిని చంపేశార‌ని అన్నారు. పుట్టా మ‌ధు అక్ర‌మాల‌పై కోర్టులో కేసులు వేశార‌ని అన్నారు. పోలీస్ క‌మిష‌న‌ర్ స‌త్య‌నారాయ‌ణ టీఆర్ఎస్‌కు తొత్తులాగా మారి ప‌నిచేస్తున్నార‌న్నారు.
ఈ కేసులో నిందితుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే ఉద్య‌మం పెద్ద ఎత్తున చేస్తామ‌ని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి హెచ్చ‌రించారు.

ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ట్వీట్‌

ఈ హ‌త్య వెనుక టీఆర్ఎస్ హ‌స్తం ఉంద‌న్నారు. రాష్ట్రంలో పోలీసు వ్య‌వ‌స్థ పైన న‌మ్మ‌కం పోయింద‌న్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎంక్వైరీ వేయాల‌ని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని క‌లిసి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాసి, పార్ల‌మెంట్‌లో ఈ ప్ర‌స్తావ‌న తీసుకొస్తామ‌న్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించే వ‌ర‌కు పోరాడ‌తామ‌ని హెచ్చ‌రించారు.

ఇది చ‌ద‌వండి:మ‌నిషి మాంసం తినే తెగ గురించి తెలుసా?

ఇది చ‌ద‌వండి:జీతాల్లేవు..భ‌ద్ర‌త లేదు!

ఇది చ‌ద‌వండి:తెలంగాణ కోడ‌ల‌ను నేను.. విమ‌ర్శ‌కుల‌కు ష‌ర్మిలా స‌మాధానం!

ఇది చ‌ద‌వండి:పెద్ద‌ప‌ల్లిలో హైకోర్టు న్యాయ‌వాది దంపతుల దారుణ హ‌త్య

ఇది చ‌ద‌వండి: కేసీఆర్ ఒక విల‌న్: భ‌ట్టి విక్ర‌మార్క

ఇది చ‌ద‌వండి:త‌మిళ స్మ‌గ్ల‌ర్ అరెస్టు

ఇది చ‌ద‌వండి:అన్నం తిన్నొచ్చే లోపులో విషాదం మిగిలింది!

Father Suicide : నాన్న‌కు ఎంత క‌ష్ట‌మొచ్చింది!

Father Suicide : అస‌లే క‌రోనా కాలం..ఎక్క‌డా ప‌ని దొర‌క‌ని ప‌రిస్థితి..చేసే ప‌ని క‌ర్మాగారం కూడా మూత ప‌డింది. ఇక అడ్డా మీద ప‌నికి వ్చే వారికి Read more

Cheating lady arrested in Vanasthalipuram: బ్లాక్ మెయిల్ లేడీ అరెస్ట్‌

మోసాల‌కు పాల్ప‌డుతున్న Cheating lady arrested అయ్యిది. న‌గ‌రంలోని Vanasthalipuram పోలీసులు Cheating lady arrested తో ప‌లు షాకింగ్ విష‌యాలు తెలిపారు. Hyderabad: మ‌గ‌వాళ్ల‌ను త‌న Read more

Knife Attach News | పంచాయ‌తీ తీర్పులో మాజీ స‌ర్పంచ్‌పై క‌త్తితో దాడి

క‌ర్క‌ప‌ల్లి గ్రామంలో దారుణం Knife Attach News | పంచాయ‌తీ తీర్పులో మాజీ స‌ర్పంచ్‌పై క‌త్తితో దాడిJayashankar Bhupalpally : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గ‌ణ‌పురం మండ‌లం Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Leave a Comment

Your email address will not be published.