Core Web Vitals Assessment: TPCC Chief Revanth Reddy: రేవంత్ అడుగుతో వేడెక్కుతున్న రాజ‌కీయం!

TPCC Chief Revanth Reddy: రేవంత్ అడుగుతో వేడెక్కుతున్న రాజ‌కీయం!

TPCC Chief Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి రోజులు వ‌చ్చాయ‌నే న‌మ్మ‌కం ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో పెరిగింది. రానున్న ఎన్నిక‌ల్లో ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేసే ఆలోచ‌న క‌చ్చితంగా ఉంద‌నే ఆశ ఆ పార్టీ నేత‌ల్లో మ‌దులుతోంది. ఇందుకు కార‌ణం..రేవంత్ రెడ్డి!..ఇప్పుడు ఈ పేరు తెలంగాణ‌లో మారుమ్రోగుతోంది.


TPCC Chief Revanth Reddy: ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా సందిగ్ధంలో ఉందో అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణ‌యం కాస్త ఇంధ‌నం పోసు కున్న‌ట్టు ఊపిరి పీల్చుకుంటోంది. కార‌ణం రేవంత్ రెడ్డిని టిపిసిసి ఛైర్మ‌న్‌గా ఎంపిక చేయ‌డ‌మే. ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయం కాక పెరిగిన‌ట్టు ఉంది. గ‌తంలో ముంద‌స్తుకు వెళ్లి తెలంగాణ రాజ‌కీ యాల్లో ఊహించ‌ని ట్విస్టునిచ్చి, ప్ర‌తిప‌క్షాల‌ను కోలుకోని దెబ్బ‌తీసిన సీఎం కేసీఆర్‌కు ఈ సారి ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌తిప‌క్షాలు జాగ్ర‌త్త‌ప‌డుతున్నాయా? అన్న సందేహం క‌ల్గుతోంది. అందుకు రేవంత్ రెడ్డి నియామ‌క‌మే దానికి ఆజ్యం పోసింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

లేకుంటే ఇప్పుడు రాజ‌కీయాల్లో ఇంత కాక ఉండేది కాదని, బీజేపీ కూడా ఇంత దూకుడు ప్ర‌ద‌ర్శిం చేది కాక‌పోవునేమో! ఇక తెలంగాణ‌లో మేమే ప్ర‌త్యామ్నాయం అన్న ఆలోచ‌న త‌ప్ప ఆచ‌ర‌ణ కాస్త త‌గ్గించిన బిజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి స‌రైన అవ‌కాశాలు దొర‌క‌డం లేదు. పైగా కేంద్రం ప్ర‌భుత్వంక ఊడా విమ‌ర్శ‌ల‌పాలౌతోంది. ఇటీవ‌ల దేశంలో జ‌రిగిన ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బిజేపీ అనుకు న్నంత‌గా రాణించ‌లేదు. రాష్ట్రంలో జ‌రిగిన నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ బిజేపీ పెద్ద‌గా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేదు. అందుకు ఎవ‌రు చెప్పే స‌మాధానాలు వారు చెప్పినా, ఎలాగైనా కాంగ్రెస్ గెల‌వ‌ద్ద‌న్న ఆలోచ‌న‌తోనే అక్క‌డ కాస్త సైలెంటుగా ఉండి, టిఆర్ఎస్ గెలుపు సులువు చేసింద‌నే వాద‌న‌లు కొట్టిపారేయ‌లేనివే..! దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో చూపినంత ఉత్సాహం నాగార్జున సాగ‌ర్‌లో చూపించ‌ లేద‌న్న‌ది నిర్వివాదాంశం. అలాగే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో క‌న‌బ‌ర్చిన దూకుడు నాగార్జున సాగ‌ర్లో లేదు. ఇప్ప‌డు మ‌ళ్లీ హుజూరాబాద్‌లో దూకుడు పెంచే ప్ర‌య‌త్నం జోరుగానే సాగుతోంది. అందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ పాద‌యాత్ర కూడా ప్లాన్ చేశారు. త‌న మొద‌టి ద‌ఫా పాద‌యాత్ర కూడా హుజూరాబాద్ వ‌ర‌కే అన్న మాట‌లోనే అర్థం చేసుకోవ‌చ్చు. ఆ పాద‌యాత్ర‌కు ప్ర‌జాస్వామిక తెలంగాణ కోసం అని చెప్పుకున్నా, ఎన్నిక‌ల కోస‌మే ప్ర‌జ‌ల్లో ఆ ఎన్నిక దాకా ఈటెల వ్య‌వ‌హారం, ఆయ‌న‌కు జ‌రిగిన అన్యాయం స‌జీవంగా ఉంచేందుకే అన్న‌ది తెలుస్తోంది. అందుకే అలాంటి అనుమానాలు ఎవ‌రూ వ్య‌క్తం చేయ‌కుండా ఉండేందుకు ఇది తొలి విడ‌త మాత్ర‌మే అని కండిష‌న్స్ అప్ల‌య్ అంటున్నారు.

రేవంత్ దూకుడు ఎవ‌రికి న‌ష్టం?

రేవంత్ రెడ్డి కొత్త‌గా టిపిసిసి ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత మొద‌టి ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్ని క‌లే. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో కాంగ్రెస్‌కు ప‌డ్డ ఓట్లు ఈటెల‌కు ప‌డే అవ‌కాశం లేదు. ఈ సారి కాంగ్రెస్‌కు ఓట్లు పెరిగితే ఈటెల‌కు క‌ష్ట‌మే అవుతుంద‌ని కూడా అంటున్నారు. ఎంత లేద‌న్నా, టిపిసిసి ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత మొద‌టి ఎన్నిక కావ‌డం వ‌ల్ల ఎంతో కొంత మైలేజీ కోసం ఆయ‌న ప్ర‌య‌త్నించ‌డం అన్న‌ది త‌ప్ప‌దు. ఇది ఈటెల‌కే మైన‌స్ అవుతుంద‌న్న వాద‌న‌లున్నాయి. పైగా ఈటెల‌ను ఎలాగైనా కాంగ్రెస్‌లోకి తీసుకురావ‌డానికి రేవంత్ బాగానే ప్ర‌య‌త్నం చేశాడ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే ఆయ‌న బిజేపిలో చేర‌డం స‌హ‌జంగా రేవంత్‌కు ఇష్టం లేని వ్య‌వ‌హా ర‌మే, అందుకే ఈటెల కేసీఆర్ వ‌దిలిన బాణ‌మే అంటూ త‌న‌దైన శైలిలో రేవంత్ విరుచుకుప‌డిన సంద‌ర్భం ఇటీవ‌లే చూశాం. ఎటు చూసినా ఈటెల‌కు రానురాను ఎన్నిక‌ల స‌మ‌రం ఎలా ఉండ‌ బోతోంద‌న్న‌ది ఒక ర‌కంగా ఆందోళ‌న చెందించే అంశంగానే మారుతోంది. ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా అంద‌రికీ లైఫ్ అండ్ డెత్ స‌మ‌స్యేగా మిగిలింది. ఈటెలు గెలిస్తే టిఆర్ఎస్‌లో లుక‌లుక‌లు మొద‌ల‌వుతాయి. టిఆర్ఎస్ గెలిస్తే బిజేపీ బ‌ల‌హీన‌మౌతుంది. మ‌ధ్య‌లో కాంగ్రెస్ గెలిస్తే, టిఆర్ఎస్‌, బిజేపీల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌ర‌మ‌వుతోంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *