Tour Schedule : ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి రెండ్రోజుల పాటు సొంత జిల్లా అయిన కడపలో పర్యటించనున్నారు. ఈ సదర్భంగా పర్యటన వివరాలను మీడియాకు అందజేశారు.
Tour Schedule : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండ్రోజుల కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ సీఎం పర్యటన వివరాలను వెల్లడిం చారు. ఈ నెల 8,9 తేదీల్లో బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో జగన్ పర్యటించ నున్నారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు తన నివాసానికి చేరుకుని 2.00 గంటల వరకు అక్కడే ఉంటారు. 8వ తేదీన సీఎం ఉదయం 8.30 గంటలకు తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 8.50 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలు దేరి 9.55 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.40 నుంచి అనంతపురం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 1.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడ నుంచి బయలుదేరి 1.50 గంటలకు తన నివాసానికి చేరుకుని 2.00 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి పులివెందులలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 2.25 గంటల నుంచి 3.00 గంటల వరకు అక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 3.05 గంటలకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ నుంచి పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
3.15 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి ఇడుపలపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3.35 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. 3.40 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని 4.00 నుంచి 4.45 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 4.50 గంటలకు ఇడుపలపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
9వ తేదీ ఉదయం 10.00 గంటలకు ఇడుపలపాయ ఎస్టేట్ నుంచి 10.10 గంటలకు అక్కడే ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 10.40 గంటలకు బద్వేలులోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.05 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 11.10 నుంచి 12.45 గంటల వరకు బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు.
అనంతరం అక్కడి నుంచి 1.15 గంటలకు బయలుదేరి 1.20 గంటలకు కడప రిమ్స్ వద్ద గల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 2.05 గంటలకు సీపీబ్రౌన్ గ్రంథాలయం చేరుకుని సీపీ బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 2.25 గంటలకు అక్కడ నుంచి బయలు దేరి కలెక్టరేట్ సమీపంలో ఉన్న మహావీర్ సర్కిల్‌కు చేరుకుని కడపకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
3.30 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 3.45 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియానికి చేరుకుంటారు. 3.50 నుంచి 4.20 గంటల వరకు స్టేడియం లో అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 4.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రిమ్స్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 4.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!