Tooth Paste Side Effects | మనం ఉదయాన్నే మేల్కొనగానే పళ్ళు శుభ్రం చేసుకునే అలవాటు ప్రపంచంలో ప్రతి మానవుడికీ ఉంది. మన ముఖం అందంలో భాగం పళ్లు. వీటిని ప్రతి రోజూ శుభ్రం చేస్తూ అందంగా తెల్లగా మెరిసేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ప్రపంచంలోనే పళ్ళు తోముకునే టూత్ పేస్టులు చాలా ఉన్నాయి. ఎవరికి నచ్చిన పేస్టు వాళ్లు వాడుతుంటారు. అది నచ్చకపోతే మరొకటి నెల తిరక్కముందే కొత్తది మార్చుతారు.
పళ్లు ఎందుకు తోముకుంటారు?
ఈ ప్రపంచంలో పళ్లు ఎందుకు తోముకుంటారనే ప్రశ్న సర్వ సాధారణమైనది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్లందరికీ తెలిసిన విషయమే. పళ్లు తళ తళా మెరస్తూ ఉండేందుకు అని కొందరు, తాజాతనం కోసం, నోరు దుర్వాసన వేయకుండా ఉండేందుకు అని, పళ్లు చెడిపోకుండా ఉండేందుకు అని, చిగుళ్ళు చెడిపోకుండా ఉండేందుకు అని ఇలా రకరకాల సమాధానాలు అందరి నుండీ వస్తుంటాయి. అయితే పళ్ళు ఎంత ఎక్కువ కాలం మన నోటిలో ఊడిపోకుండా ఉంచగలిగితే అదే దంత నావశ్యకతని మన పూర్వీకులు చెబుతున్నారు.

ఏ టూత్‌పేస్టు మంచిది?
ఈ ప్రశ్న చాలా మందికి ప్రతిరోజూ ఉదయాన్నే అప్పుడప్పుడు మెదిలే సందేహంగా చెప్పవచ్చు. ఎప్పుడైనా పళ్ళ డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు మొట్టమొదటిగా అడిగే ప్రశ్న కూడా ఇదే. పళ్లపొడుల వ్యాపారస్థులు, టూత్ పేస్టుల వ్యాపారస్థులు టూత్ పేస్టులు ఉత్పత్తి చేసే కంపెనీల వారు రకరకాల వ్యాపార ప్రకటనలతో ప్రజలను తికమక పెట్టేస్తున్నారు. దుర్వాసన పోయి రోజంతా మీ నోరు చక్కని పరిమళాన్ని వెదజల్లుతుందని, దీంతో దంత క్షయాన్ని అరికట్టండి అని, పళ్ళను గట్టి పరుచుకోండి అని..ఇలా రోజంతా డిజిటల్ మీడియాలో, పత్రికలల్లో మనం చూస్తూనే ఉంటాం.
Tooth Paste Side Effects | రుచిని బట్టి ప్రాధాన్యత?
ఈ టూత్ పేస్టులు వచ్చిన కొత్తలో ఓ ఎడ్వర్డు అనే వ్యక్తి పరిశోధన చేసి టూత్ పేస్టును ఎందుకు ఉపయోగిస్తారు. ఏ టూత్ పేస్టును ఉపయోగిస్తారు? అనే ప్రశ్నను చాలామందికి వేశారంట. వారిలో నుండి ఎక్కువగా వచ్చిన సమాధానం వింటే విస్తుపోవాల్సిందే. అది ఏమిటంటే టూత్ పేస్టు రుచిని బట్టి ప్రాధాన్యత ఇస్తామని సమాధానం చెప్పడంతో ఎడ్వర్డు అనే వ్యక్తి షాక్ తిన్నారంట. సాధారణంగా ఏ టూత్ పేస్టునైనా ఒకే పద్ధతిలో తయారు చేయబడతాయి. ఒకే ఫార్మూలాను ఉపయోగిస్తారు. వీటిలో ఏదీ తేడా ఉండదు.
సబ్బు, సుద్ధతో తయారీ?
ఈ పేస్టుల తయారీలో సబ్బు వాసన, సుద్ధ రుచి కోసం కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారు. పళ్ళు తోముకునే సమయంలో నురగ రావడానికి సబ్బు, పళ్ళు తెల్లని రంగు వచ్చేందుకు సుద్ధా చేరుస్తారంట. ఈ టూత్‌పేస్టుల వల్ల మేలు కన్నా కీడు ఎక్కువగా ఉందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. క్రిములని చంపే గుణం కలిగిన సబ్బుతో కూడిన టూత్‌పేస్టుల వల్ల చిగుళ్ళకు హాని కలగుతుంది. చిగుళ్ళు గట్టిపడే బదులు మెత్తబడతాయట. ఈ రోజు మార్కెట్లలో ఉన్న ఏ టూత్ పేస్టూ కూడా కనీసం ప్రకటనలలో చూపించే మేలును 30 శాతం కూడా చేయడం లేదని తేలింది.

పళ్లకు ఇవి మేలు చేస్తాయి!
చిగుళ్ళను గట్టి పరిచే గుణం మామూలు ఉప్పుకు, నోట్లో పాచిని దూరం చేయగల గుణం తినే సోడాకు ఉంటుందట. ఈ రెండింటినీ కలిపి పళ్ళు తోముకోవడం వల్ల ఏ టూత్‌పేస్టు చేయనంతగా మేలు చేకూరుతందని ఎడ్వర్డ్ పరిశీలించి కనుకున్నారు. తీపి వస్తువులను తగ్గించి, ఎ, డి విటమిన్లు గల సక్రమమైన ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకుంటుంటే దంతాలు జీవితాంతం పనిచేస్తాయని, టూత్ పేస్టుల మోసాలని గ్రహించాలని అంటున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ