tomato facial benefits

tomato facial benefits: టొమాటో ఫేసియ‌ల్ తో మెరిసే అందం మీ సొంతం!

Health Tips

tomato facial benefits: అందంగా క‌నిపించాలంటే కోరిక ఎంత‌గా ఉన్నా అందుకోసం గంట‌లు గంట‌లు కేటాయించ‌లేం క‌దా! అంటుంటారు చాలా మంది. అలాంటి వారు టొమాటోతో అతి త‌క్కువ స‌మ‌యంలో ఇలా మెరిసిపోవ‌చ్చు తెలుసా!. సాధార‌ణంగా ఎండ‌కు ముఖం, మెడా, చేతులు వంటివి న‌ల్ల‌గా మారుతుంటాయి. ఈ న‌లుపుద‌నం పోవాలంటే టొమాటో గుజ్జులో చెంచా పాలు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ఒంటికి రాసుకున్నా కొన్ని నిమిషాల పాటు ఆర‌నిస్తే చాలు. ఇలా రోజూ చేస్తుంటే క్ర‌మంగా(tomato facial benefits) న‌లుపుద‌నం త‌గ్గుతుంది.

టొమాటో ఫేసియ‌ల్

చ‌ర్మం గ‌రుకుగా ఉంటే?

కాలుష్యం, పోష‌కాల లేమి కార‌ణంగా చ‌ర్మం గ‌రుకుగా మారుతుంది. టొమాటో గుజ్జులో చెంచా బాదం పేస్ట్‌, తేనే, పంచ‌దార, పెస‌ర‌పిండి క‌లిపి ఒంటికి రాసుకుని సుతారంగా రుద్దితే మృత‌కణాల స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది. పావు క‌ప్పు టొమాటో గుజ్జులో చెంచా గులాబీ రేకుల ముద్ద‌, చెంచా తేనె, పావు క‌ప్పు బొప్పాయి గుజ్జు క‌లిపి ఆ మిశ్ర‌మంతో ముఖానికి ప్యాక్‌లా వేయండి. కాసేప‌టి త‌ర్వాత గోరువెచ్చ‌ని నీళ్ల‌తో క‌డిగేసుకుంటే చ‌ర్మం తాజాగా క‌నిపిస్తుంది. నిగారింపూ వ‌స్తుంది. చెంచాడు పాలూ, టొమాటో గుజ్జు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించాలి. ష‌వ‌ర్ క్యాప్ పెట్టి అర‌గంట‌య్యాక క‌డిగేసుకుంటే జ‌ట్టు కాంతివంతంగా క‌నిపిస్తుంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *