Tomato Benefits : టమోటా ఒక యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్(cholesterol)ను తగ్గిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. గ్యాస్ సమస్యలకు ఉత్తమ ఔషధం, చక్కెర శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. జుట్టుకు బలాన్ని చేకూరుస్తుంది.
Tomato Benefits : శరీరంలో కొవ్వు నిల్వలు చేరకుండా ఉండాలంటే రోజు వంటల్లో టమాటాలను చేర్చుకోవాల్సిందే అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. రక్తపోటుకు దూరండా ఉండాలన్నా, శరీరంలో కొవ్వు(cholesterol) నిల్వలు దూరం చేసుకోవాలన్నా, టామోటా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. గుండెపోటును చెక్ పెట్టాలన్నా..టమాటా తినాల్సిందే. ఎందుకంటే? టమాటాపై ఉండే ఎరుపు రంగు పొరల్లో లైకోపిన్ ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే రోజుకు 25 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ లైకోపిన్ ఉండే ఆహారం అంటే టమోటాను తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ ను పది శాతం వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా..రోజుకు అరలీటరు టమాటా జ్యూస్ తాగితే..లేదా 50 గ్రాముల టమోటా గుజ్జు తీసుకున్నా గుండె జబ్బులకు గుడ్‌బై చెప్పేయొచ్చు. టమోటాలను రోజువారీగా తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను, రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఊపిరితిత్తులు, స్టొమెక్, ప్రోస్టేట్ క్యాన్సర్లను నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


ప్రోస్టేట్ కేన్సర్(prostate cancer)ను నివారించే టమాటాలు
ప్రతిరోజూ ఆహారంలో టమాటాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో ప్రోస్టేట్ కేన్సర్ణు దూరం చేసుకోవచ్చునని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వారానికి దాదాపు ఒకటిన్నర కిలోల టమాటాలను ఆహారంలో తీసుకునే పురుషుల్లో ప్రోస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు చాలా తక్కువ అని బ్రిటీష్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. పురుషుల్లో ఏర్పడే రెండోవ అతిపెద్ద వ్యాధి ప్రోస్టేట్ కేన్సర్. టామాటాలు ఈ కేన్సర్ కారక కణాలను నిర్మూలిస్తాయని పరిశోధకులు తెలిపారు. కేన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మాంసం, కొవ్వు పదార్థాలు, ఉప్పు తగ్గించాలని వారు సూచిస్తున్నారు.
- చూడటానికి ఎర్రగా నిగనిగలాడూ రుచికరంగా ఉండే టమాటాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యానికి, రక్తాన్ని శుభ్ర పరచటానికి.. ఇలా టమాటాల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఎన్నో…ఎన్నెన్నో ఉన్నాయి. ఈ క్రమంలో టమాటాల్లో దాగున్న పోషకాలు…అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి.. మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం.
- క్యాలరీలు తక్కువుగా ఉండే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. అలాగే కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంగా తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు అభిప్రాయం.
- అధిక బరువును తగ్గించుకోవడంలో భాగంగా వ్యాయామం, డైటింగ్.. మొదలైనవి చేస్తున్నారా? అయితే మీరు మరో పని కూడా చేయాలి. ప్రతి రోజూ టమాటా తింటే సరిపోతుంది.
- రొమ్ము, కొలన్, ఊపిరితిత్తులు.. మొదలైన క్యాన్సర్లన్నింటి నుంచీ రక్షణ కల్పించే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ టమాటాల్లో ఎక్కువుగా లభిస్తుంది.
- విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. రేచీకటిని నిరోధించడానికైనా, కంటి చూపును మెరుగుపరుచుకోవడానికైనా.. విటమిన్ ఎ అధికంగా లభించే టమాటాల్ని తినడం శ్రేయస్కరం. ఈ విటమిన్ వల్ల జట్టు బలంగా మెరుస్తూ ఉంటుంది.


- రక్తం శుద్ధి చేయడంతో పాటా మూత్రాశయంలో ఎలాంటి ఇన్పెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
- టమాటాల్లో సోడియం, శ్యాచురేటెడ్ కొవ్వులు..తక్కువుగా ఎ, సి, కె విటమిన్లు, పొటాషియం ఎక్కువుగా ఉంటాయి. అలాగే శరీరానికెంతో అవసరమైన మెగ్నీషియం, ఫాస్ఫరన్, కాపర్, ధయమిన్, నియాసిన్. మొదలైన పోషకాలు కూడా ఉంటాయి.
- టమాటాల్లో పీచు, నీటి శాతం ఎక్కువుగా ఉంటుంది. కాబట్టి మనం రోజూ టమాటాల్ని తినడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
- టమాటాలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు.
- రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండటం చాలా ముఖ్యం. మరి ఇది సాధ్యం కావాలంటే క్రోమియం ఎక్కువుగా లభించే టమాటాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.
కోపాన్ని అదుపు చేసే టమోటా!
మనం తయారు చేసుకునే మరింత రుచికరంగా ఉండేందుకు ఉపయోగించే కూరగాయ టమోటా. తాజా కూరలు, పండ్లను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు తగిన మోతాదులో అందుతాయి. ఇది శరీరానికి కావాల్సిన మంచి పోషక పదార్థాలను అందిస్తుంది.


అయితే, ఇతర కూరగాయల కంటే టమోటాలో విటమిన్ సి(vitamin c) శాతం అధిక మోతాదులో ఉంటుంది. దీంతో ఆహారంగా దీనిని తీసుకునే వారికి అజీర్తి వంటి సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిలో ఉండే ఎ, సి విటమిన్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. దంతాలను దృఢపరిచేందుకు కూడా టమోటా ఉపయోగపడుతుంది. టమోటాలను తినడం ద్వారా అనురాగం, ప్రేమ, క్షమాగుణం మొదలైనవి అధికమౌతాయని ఓ సర్వేలో కూడా తేలింది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఏడు రకాల లవణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కూడా ఈ లవణాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలను టమోటాలు అధిక శాతంలో కలిగి ఉంటాయి. దీనిలోని విటమిన్లు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. కాలేయంలోని క్రిములను నిర్మూలించడంలో టమోటాలోని విటమిన్లు ఎంతగానో దోహదపడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!