Toll Plaza: Heavy traffic jam on Vijayawada-Hyderabad National Highway | నగరానికి పయనం..హైవేపై భారీ ట్రాఫిక్ జామ్!
Toll Plaza: Heavy traffic jam on Vijayawada-Hyderabad National Highway | నగరానికి పయనం..హైవేపై భారీ ట్రాఫిక్ జామ్!Hyderabad: సంక్రాంతి పండుగ హడావుడి సంతోషంగా ముగిసింది. పిండి వంటలతో, పచ్చళ్ల సీసాలతో నగరానికి మళ్లీ ప్రయాణం మొదలైంది. పండక్కి సొంతూరుకు వెళ్లిన జనం తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో సొంతూ ఊర్లకు వెళ్లి బంధుమిత్రులతో ఆనందంగా గడిపి సంక్రాంతి పండుగ చేసుకున్న పలువురు ఉద్యోగస్థులకు సెలవులు ముగిశాయి. ఈ క్రమంలో సోమవారం నుండి ఆఫీసులు ప్రారంభమైయ్యాయి. నగరవాసులు, ఉద్యోగులు తిరిగి హైదరాబాద్ సిటీకి పయనమయ్యారు. ఆదివారం సాయంత్రం పింటి వంటలను దండిగా క్యాన్లలోనూ, బ్యాగుల్లోని సర్ధుకొని సొంత వాహనాలతో రోడ్డెక్కారు. ఈ క్రమంలో విజయవాడ- హైదరాబాద్ మధ్యలో ఉన్న టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది.
విజయవా నుండి హైదరాబాద్ కు వెళ్లే హైవే వైపుకు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నప్పటికీ రద్ధీ అధికంగానే ఉంది. సోమవారం సాయంత్రం వరకు ఇదే తరహా రద్ధీ ఉంటే అవకాశాలు కనిపిస్తున్నట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇది చదవండి: ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు
ఇది చదవండి: ఇక ఫుల్ డే తరగతులు..వేసవి సెలవులు రద్దు!