today petrol diesel price in India ఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య వాహనదారుడికి గుండెల్లో భయం పుట్టించిన మాట వాస్తవే అని అందరికీ తెలుసు. బయటకు వచ్చేటప్పుడు బండి తీయాలా వద్దా? అని పది సార్లు ఆలోచించేలా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తుకు వచ్చేవి. ఆకరికి కుర్రకారుకు తన లవర్ ఎక్కడికైనా వెళదామన్నా పాపం పోరగాళ్లు గుక్కిళ్లు మింగుకుంటా బండి తీయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆటోలు, ట్యాక్సీలు నడిపే డ్రైవర్లన్నకు మాత్రం గుండె మీద భారం ఉంచుకొని బతుకు భారాన్ని నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒక రోజు ధరలు తగ్గాయి అన్న 24 గంటల్లో అంతకంతకూ పెరిగిన ధరలు అనే మాట, పెట్రోల్ బంకుల్లో కనిపించే ధరల పట్టిక నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ఇక ఎలా ఉన్నా.. బండి నడవంది బతుకు పోరాటం ముందుకు పోదు.. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఈ పెట్రోల్, డీజిల్ బాధలు తప్పడం(today petrol diesel price in India) లేదు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ దర రూ.108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62 గా ఉంది. కరీం నగర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.07గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.95.68 గా ఉంది. మెదక్లో లీటర్ పెట్రోల ధర రూ.108.84గా ఉంది. డీజిల్ ధర రూ.95.22గా ఉంది. రంగా రెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ దర రూ108.44 ఉండగా, డీజిల్ ధర రూ.94.84 గా ఉంది. వరంగల్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.88 పలుకుతుండగా లీటర్ డీజిల్ దర రూ.94.31గా ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.98కు లభిస్తుండగా, లీటర్ డీజిల్ ధర రూ.97లకు లభిస్తోంది. విశాకపట్టణంలో పెట్రోల్ ధర రూ.109.71 ఉండగా, డీజిల్ ధర రూ.95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.71లకు లభిస్తుండగా, డీజిల్ ధర రూ.95.79గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ దర రూ.109.68గా ఉండగా, డీజిల్ ధరూ.96.03గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.98లకు లభిస్తుండగా, డీజిల్ ధర రూ.97లకు లభిస్తోంది.


ఇక దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.103.97గా ఉండగా, లీటర్ ,,డీజిల్ ధర రూ.86.67లకు లభిస్తోంది. ఇదే సమయలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109. 98లకు లభిస్తుండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్కత్తాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా, డీజిల్ ధర రూ.89.79గా ఉంది. చెన్నైల్లో పెట్రోల్ ధర రూ.101.40 ఉండగా డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలకుతుండగా డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.28 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉందన్నమాట.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!