JSForAP_Roads

JSForAP_Roads: గ‌జానికో గొయ్యి..రోడ్ల ప‌రిస్థితిపై జ‌న‌సైనికుల ఉద్య‌మం విజ‌య‌వంతం!

Spread the love

JSForAP_Roads: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క పిలుపుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు అధ్వానంగా ఉన్న రోడ్ల ప‌రిస్థితిని మీడియా కంటే ముందుగా వెలుగులోకి తీసుకొ చ్చారు. JSForAP_Roads హ్యాష్ ట్యాగ్ ద్వారా రెండున్న‌ర ఆంధ్రాలోని ఉన్న రోడ్ల ప‌రిస్థితి ఫొటోల‌ను ట్విట్ట‌ర్ లో నింపారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎప్పుడైతే పిలుపు నిచ్చారో అప్ప‌టి నుంచి దాదాపుగా 6.2 ల‌క్ష‌ల‌కుపైగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ట్విట్లు చేశారు. మూడు రోజుల పాటు చేప‌ట్టిన ఉద్య‌మం విజ‌య‌వంతం అవ్వ‌డం ప‌ట్ల పార్టీ అధినేత సంతోషం వ్య‌క్తం చేశారు.

ల‌క్ష‌లాది మంది ఈ ఉద్య‌మంలో పాల్గొని త‌మ ప్రాంతాల్లోని రోడ్లు ఏ విధంగా పాడైయ్య‌యో , ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో తెలియ‌జేశారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి రోడ్ల దుస్థితిని తెలియ‌జేస్తూ శ‌నివారం మ‌ధ్యాహ్నానికి దాదాపు 6 ల‌క్ష‌ల 20 వేల ట్వీట్లు చేశారు.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ద్వారా దాదాపు రెండున్న‌ర కోట్ల మంది ప్ర‌జ‌ల ముందు ఆంధ్రాలో అధ్వానంగా ఉన్న రోడ్ల స‌మ‌స్య‌ల‌ను వారు చూసేలా చేశామ‌ని జ‌న‌సైనికులు, పార్టీ అధినేత చెబుతున్నారు.

ఫొటోల‌న్నీ చూశాను: ప‌వ‌న్

సోష‌ల్‌మీడియాలో వ‌చ్చిన ఫొటోలు, వీడియోలు చూశాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా పామ‌ర్రు, పెడ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్లు, విశాఖ జిల్లా పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్లు, అనంత‌ర‌పురం జిల్లా గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గంఓల‌ని రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్న‌యోన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.

తూర్పుగోదావ‌రి జిల్లా క‌డియం ప్రాంతంలో అయితే పెద్ద పెద్ద గుంత‌ల‌తో నీళ్లు నిండి పైరు వేసుకునేలా రోడ్లు త‌యార‌య్యాయిని అన్నారు. ఆ జిల్లాలోనే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గోక‌వ‌రం నుండి గుర్తేడు – పాత కోట వెళ్తున్న ఆర్‌టీసీ బ‌స్సుకి రోడ్డుపైన గుంత‌లు కార‌ణంగా ర‌న్నింగ్‌లో ఉన్న వెనుక చ‌క్రాలు ఊడిపోయాయి. బ‌స్సులో ఉన్న 25 మంది ప్ర‌యాణికులు తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు.

ఇక నెల్లూరు జిల్లా గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌జానికో గొయ్యి క‌నిపిస్తోంద‌ని తెలిపారు. ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తి ప్రాంతంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు ర‌హ‌దారి ప‌రిస్థితి గురించి ఇక చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని జ‌న‌సైనికులు అంటున్నారు.

క‌నీసం సొంత జిల్లాలో అయినా రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయించ‌లేక‌పోయార‌ని మంత్రుల‌ను, నాయ‌కుల‌ను జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శిస్తున్నారు. వైస్సార్ పేరును అవ‌మానించేలా జిల్లాలో రోడ్లు ప‌రిస్థ‌తి ఉంద‌ని, తిరుప‌తి ప్రాంతంలో ర‌హ‌దారులు పాడైపోయాయ‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌ళ్లు తెర‌వాలి: ప‌వ‌న్‌

అడుగో గుంత‌..గ‌జానికో గొయ్యిలా త‌యారై ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్నారు. పాడైన రోడ్ల‌ను ప‌రిశీలించి మ‌ర‌మ్మ‌తులు ప్రారంభించి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌న్నారు. రోడ్ల దుస్థితిని ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి తెలియ‌జేద్దాం.. అనే ఒకే ఒక్క పిలుపుతో స్పందించిన జ‌న‌సైనికుల‌కు, వీర మ‌హిళ‌ల‌కు, ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్టు ప‌వ‌న్ అన్నారు.

Bheemla Nayak: అడ‌వి పులి గొడ‌వ ప‌డే ఒడిసిప‌ట్టో..వ‌చ్చేసింది బీమ్లా నాయ‌క్ First Glimpse…ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎంట్రీ మామూలుగా లేదు భ‌య్యా!

Bheemla Nayak First Glimpse: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా క్రేజే వేరు అబ్బా.. అన్న సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు వెయ్యిక‌ళ్ల‌తో చూస్తుండ‌గా Read more

AP News Today: ఉత్త‌రాంధ్ర‌లో మ‌న పార్టీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది సార్‌! ఫోక‌స్ పెట్టండి!

AP News Today: జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు టి.శివ‌శంక‌ర్‌, బొలిశెట్టి స‌త్య బుధ‌వారం మ‌ధ్యాహ్నం క‌లిశారు.ఈ సంద‌ర్భంగా వారితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ Read more

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet | స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు..బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లం కాదు!

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet తిరుప‌తి ప్రెస్‌మీట్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ Tirupathi : జ‌న‌సేన Read more

Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాల‌యాల‌ను ర‌క్షించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం

Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాల‌యాల‌ను ర‌క్షించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లంRajamahendravaram: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ విగ్ర‌హాల దాడి ఘ‌ట‌న వెలుగు చూసింది. Read more

Leave a Comment

Your email address will not be published.