today horoscope

today horoscope: ఈరోజు Rasi Phalalu జ‌న‌వ‌రి 5, 2022

Special Stories

today horoscope: ఈరోజు Rasi Phalalu జ‌న‌వ‌రి 5, 2022: ఈ రోజు అన‌గా (05-01-2022) రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి! సూర్యోద‌యం: 6.35, సూర్యాస్త‌మ‌యం: 5.35,రాహుకాలం: ప‌.12.00 నుంచి 1.30 వ‌ర‌కు, య‌మ‌గండం: ఉ.7.30 నుంచి 9.00 వ‌ర‌కు.

today horoscope:

మేషం

చేప‌ట్టిన ప‌నుల‌లో య‌త్న కార్య‌సిద్ధి క‌లుగుతుంది. చిన్న‌నాటి మిత్రుల‌తో శుభ‌కార్యాల‌లో పాల్గొంటారు. బంధువుల‌తో విభేదాలు తొలుగుతాయి. నిరుద్యోగుల‌కు నూత‌న ఉద్యోగ‌ప్రాప్తి. వ్యాపార‌ము సొంత నిర్ణ‌యాల‌తో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ‌మున అధికారుల అనుగ్ర‌హం పొందుతారు.

వృషభం

మిత్రుల‌తో వివాదాలు మాన‌సికంగా చికాకుగా క‌లిగిస్తాయి. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల‌లో క‌నిపించినా ఫ‌లితం క‌నిపించదు. సోద‌రుల‌తో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. ఆరోగ్య విష‌యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం. దూర ప్రయాణాలు వాయిదా వెయ్య‌డం మంచింది. వ్యాపార‌, ఉద్యోగాల‌లో కొంత అసంతృప్తి త‌ప్ప‌దు.

మిధునం

బంధుమిత్రుల‌తో స్వ‌ల్ప వివాదాలు ఉంటాయి. చేప‌ట్టిన ప‌నుల‌లో క‌ష్టానికి త‌గిన ఫ‌లితం ల‌భించ‌దు. కుటుంబ వ్య‌వ‌హారాల్లో తొంత‌ర పాటు ప‌నిచేయ‌దు. పుణ్య‌క్షేత్రాలు సంద‌ర్శిస్తారు. వృత్తి వ్యాపారాల‌లో ఆక‌స్మికంగా కొన్ని నిర్ణ‌యాలు మార్చుకుంటారు. ఉద్యోగ‌మున ప‌ని ఒత్తిడి అధిగ‌మ‌వుతుంది.

క‌ర్కాట‌కం

ప్ర‌ముఖ‌ల నుంచి కీల‌క స‌మాచారం అందుతుంది. చిన్నాన‌టి మిత్రుల‌తో విందు వినోదాది కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కొన్ని ప‌నులు స‌కాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్థి క్ర‌య విక్ర‌యాలు లాభ‌సాటిగా సాగుతాయి. వ్యాపార‌మున అంచ‌నాలు అందుకుంటారు. ఉద్యోగాల‌లో స‌మ‌స్య‌లు తీర‌తాయి.

సింహం

చేప‌ట్టిన వ్య‌వ‌హారాల‌లో విజ‌యం సాధిస్తారు. జీవిత భాగ‌స్వామితో శుభ‌కార్యాల‌కు హాజ‌ర‌వుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజ‌న‌కంగా సాగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్త‌రిస్తారు. ఉద్యోగాల‌లో ప‌దోన్న‌తులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్ర‌య‌త్నాలు సానుకూల‌మ‌వుతాయి.

క‌న్య‌

ఇంటా బ‌య‌ట ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు తెలుస్తాయి. విద్యార్థుల శ్ర‌మ ఫ‌లించ‌దు. చేప‌ట్టిన ప‌నులు వాయిదా వేస్తారు. బంధువ‌ర్గంతో వివాదాలు త‌ప్ప‌వు. ఆరోగ్య విషయంలో జాగ్ర‌త అవ‌స‌రం. ఆక‌స్మిక ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్న‌వి, ఉద్యోగ‌మున ఉన్న‌తాధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి.

తుల‌

చేప‌ట్టిన ప‌నుల్లో ఆవాంత‌రాలు త‌ప్ప‌వు. దూర ప్ర‌యాణాలు వాయిదా ప‌డ‌తాయి. కుటుంబ స‌భ్యుల‌తో ఆల‌యాలు సంద‌ర్శిస్తారు. బంధువుల‌తో అకార‌ణ వివాదాలు త‌ప్ప‌వు. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల‌లో ఆలోచ‌న‌లు స్థిరంగా ఉండ‌వు. వ్యాపార‌, ఉద్యోగాల‌లో ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఉంటాయి.

వృశ్చికం

నూత‌న కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడ‌తారు. ఆత్మీయుల‌తో స‌ఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. విందు వినోద కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్థి కొనుగోలు ప్ర‌య‌త్నాలు ఫ‌లితాయి. పుణ్య‌క్షేత్రాలు సంద‌ర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల‌లో ప‌దోన్న‌త‌లు పెరుగుతాయి.

ధ‌న‌స్సు

స‌న్నిహితుల‌తో మాట ప‌ట్టింపులు ఉంటాయి. ఆర్థ‌కి ప‌రిస్థితి కొంత నిరాశ ప‌రుస్తుంది. ఆక‌స్మిక ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్న‌వి. దైవ సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. సోద‌రుల‌తో స్థిరాస్థి వివాదాలలో నూత‌న ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఉంటాయి.

మ‌క‌రం

ప్ర‌యాణాల‌లో నూత‌న వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు క‌లుగుతాయి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోటు ఉండ‌దు. స్తిరాస్థి క్ర‌య‌విక్ర‌యాల‌లో నూత‌న లాభాల‌ను అందుకుంటారు. విలువైన వ‌స్తు వాహ‌న లాభాలు పొందుతారు. ఉద్యోగాల‌లో మీ ప్ర‌తిభ వెలుగులోకి వ‌స్తుంది. నిరుద్యోగుల‌కు నూత‌న అవ‌కాశాలు అందుతాయి.

కుంభం

చేప‌ట్టిన వ్య‌వ‌హారాలు మంద‌కొడిగా సాగుతాయి. ఆర్థిక వ్య‌వ‌హారాల‌లో ఆలోచ‌న‌లు స్థిరంగా ఉండ‌వు. కుటుంబ స‌భ్యుల‌తో విబేధాలు త‌ప్ప‌వు. ఆర్థిక ఇబ్బందులు చికాకు ప‌రుస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాల‌లో లేనిపోని స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

మీనం

చేప‌ట్టిన వ్య‌వ‌హారాల‌లో పురోగ‌తి సాధిస్తారు. ఇంటా బ‌య‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. కొత్త వ్య‌క్తుల ప‌రిచ‌యాలు ఉత్సాహానిస్తాయి. బంధుమిత్రుల నుండి శుభ‌వార్త‌లు అందుతాయి. వ్యాపారాల‌లో నూత‌న పెట్టుబ‌డులు అందుతాయి. ఉద్యోగాల‌లో మ‌రింత అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *