Today Business News: ఇక ఛార్జీలు వ‌సూలు చేసే ప‌నిలో ప‌డ్డ ఎల‌న్ మ‌స్క్ | బిజినెస్ న్యూస్‌

Today Business News : ఈ రోజు ఇండియాలో బిజినెస్ న్యూస్ ఇలా ఉన్నాయి. Today Business Newsలో భాగంగా ఎల‌న్ మ‌స్క్ ట్విట్ట‌ర్ ద్వారా ఛార్జీలు వ‌సూలు చేసే ప‌నిలో ఉన్నారు. ఇక స్టాక్ మార్కెట్ న‌ష్టాల్లో న‌డుస్తుంది. అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఎల్ఐసి ఎల్ఓపి ప్రారంభం అయ్యింది. సెప్టెంబ‌ర్ లోపు 5జి సేవ‌లు ప్రారంభం కానున్నాయి. మ‌రిన్ని వార్త‌ల కోసం సంద‌ర్శించండి.

డ‌బ్బులు వ‌సూలు చేయ‌నున్న twitter

ట్విట్ట‌ర్ లోని కొంద‌రు యూజ‌ర్ల నుంచి ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్న‌ట్టు elon musk ప్ర‌క‌టించారు. తాను ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసిన త‌ర్వాత ఫ్రీ స్పీచ్ కోసం తీసుకున్నట్టు చెప్పారు. ఆదాయం పెంచుకు నేందుకు మ‌రో కొత్త నిబంధ‌న‌ను తీసుకొచ్చారు. సాధార‌ణ వినియోగ‌దారుల‌ను మిన‌హాయించి వాణిజ్య‌, ప్ర‌భుత్వ అకౌంట్ల నుంచి కొత్త ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్న‌ట్టు ట్వీట్ చేశారు. ఎలన్ నిర్ణ‌యంపై ఖాతాదారులు ప‌లు విధాలుగా విమ‌ర్శ‌లు చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

స్వ‌ల్ప న‌ష్టాల్లో stock market

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. ఉద‌యం ప్లాట్‌గా ప్రారంభ‌మైన సూచీలు త‌ర్వ‌త స్వ‌ల్ప న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ప్ర‌స్తుతం సెన్సెక్స్ 25 పాయింట్ల న‌ష్టంతో 56,950 వ‌ద్ద, నిఫ్టీ 12 పాయింట్ల న‌ష్టంతో 17,056 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి. బ్రిటానియా, ఓఎన్‌జిసి, ఇన్ఫోసిస్‌, ప‌వ‌ర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ప‌య‌నిస్తుండ‌గా, అపోలో, టైటాన్‌, డా.రెడ్డీస్‌, శ్రీ సిమెంట్స్ షేర్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి.

పెరిగిన gold కొనుగోళ్లు

అక్ష‌య తృతీయ రోజు ప‌సిడి కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా క‌నీసం 25-30 ట‌న్నుల వ్యాపారం జ‌రిగిన‌ట్టు అఖిల భార‌త ర‌త్నాభ‌ర‌ణాల మండ‌లి అంచ‌నా వేసింది. గ‌త 10-15 రోజులుగా ఉన్న సానుకూల సెంటిమెంట్ అక్ష‌య తృతీయ రోజునా కొన‌సాగింది. పెళ్లిళ్ల సీజ‌నుకు తోడు అక్ష‌య తృతీయ కూడా రావ‌డంతో మార్కెట్‌లో బంగారం విక్ర‌యాలు మ‌రింత పెరిగాయ‌ని వ్యాపారులు అభిప్రాయ‌ప డుతున్నారు. ఆఫ్ లైన్ కొనుగోళ్లు ఎక్కువుగా జ‌రిగిన‌ట్టు వ‌ర్త‌కులు తెలిపారు. మంగ‌ళ‌వారం భారీగా త‌గ్గిన gold ధ‌ర బుధ‌వారం నిల‌క‌డ‌గా ఉంది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధ‌ర రూ.47,200 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధ‌ర రూ.51,510గా ఉంది. వెండి ధ‌ర కిలో రూ.67,000గా ఉంది. నిన్న‌టితో పోల్చితే రూ.600 త‌గ్గింది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ ధ‌రలున్నాయి.

LIC IPO నేడు ప్రారంభం

నేటి నుంచి LIC మెగా ప‌బ్లిక్ ఇష్యూకు మే 9 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. సుమారు 30 కోట్ల పాల‌సీదార్లు, 13 ల‌క్ష‌ల మంది ఏజెంట్లున్న ఈ సంస్థ‌కు మొత్తం బీమా ప్రీయింలో (2020-21) 64% మార్కెట్ వాటా క‌లిగి ఉంది. కాగా ప‌బ్లిక్ ఇష్యూకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు పాల‌సీదారుల‌తో పాటు మ‌రికొంత మంది కొత్త‌వారు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు. పాల‌సీదారుకు రూ.60, రిటైల‌ర్లు, ఉద్యోగుల‌కు రూ.45 చొప్పున డిస్కౌంట్లు ఇస్తున్నారు.

సెప్టెంబ‌ర్ నాటికి 5G సేవ‌లు

అత్యంత వేగ‌వంత‌మైన డేటా ట్రాన్స్‌ఫ‌ర్‌కు వీలు క‌ల్పించే 5జి సేవ‌లు ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ నెల‌లో ప్రారంభం కానున్నాయి. మొద‌ట 13 న‌గరాల్లో ఈ సేవ‌లు స్టార్ట్ కానుండ‌గా, వాటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌క‌త్తా, చెన్నై, గురుగ్రామ్‌, చంఢీగ‌డ్‌, హైద‌రాబాద్‌, అహ్మ‌దాబాద్‌, ల‌క్నో, గాంధీన‌గ‌ర్‌, జామ్ న‌గ‌ర్‌, పుణె న‌గ‌రాలున్నాయి. 5G సేవ‌లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని AIRTEL ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Corona కోవోవాక్స్ ధ‌ర త‌గ్గింపు

క‌రోనా వ్యాక్సిన్ కోవోవాక్స్ ధ‌ర‌ను త‌గ్గిస్తున్న‌ట్టు సీరం ఇన్‌స్టిట్యూట్ ప్ర‌క‌టించింది. ఇప్పటి వ‌ర‌కు కోవోవాక్స్ ధ‌ర రూ.900 ఉండ‌గా, దాన్ని రూ.225కి త‌గ్గిస్తున్న‌ట్టు తెలిపింది. దీనికి జీఎస్టీ అద‌నం. 18 ఏళ్లు పైబ‌డిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌ని గ‌తేడాది DCGI అనుమ‌తి ఇవ్వ‌గా 12-17 ఏళ్ల మ‌ధ్య‌వారు కూడా తీసుకోవ‌చ్చ‌ని ఇటీవ‌ల అనుమ‌తి ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *