Big Breaking: తెలంగాణ రాష్ట్రంలో Night Curfew

0
21

Big Breaking: తెలంగాణ రాష్ట్రంలో Night Curfew

Night Curfew : క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి మే 1వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్న‌ట్టు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. రాత్రి 8 గంట‌ల‌కే కార్యాల‌యాలు, దుకాణాలు, హోట‌ళ్లు మూసివేత‌కు ప్ర‌భుత్వం ఆదేశించింది. ఆస్ప‌త్రులు, ఫార్మ‌సీలు, ల్యాబ్‌ల‌కు మాత్రం మిన‌హాయింపు ఇచ్చింది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో క‌రోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. సోమ‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 1,22,143 క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 5,926 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌తో మొత్తంగా రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,61,359 కు కేసుల సంఖ్య చేరింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం బులిటెన్ విడుద‌ల చేసింది. సోమ‌వారం ఒక్క‌రోజే క‌రోనాతో 18 మంది మృత్యువాత ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు మృతుల సంఖ్య 1,856 కి చేరింది. క‌రోనా బారి నుంచి సోమ‌వారం ఒక్క రోజే 2,209 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న బాధితుల సంక్‌య 3,16,656 కు చేరింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది.

Latest Post  VRA ల స‌మ్మెకు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ మ‌ద్ద‌తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here