

AP CRIME NEWS: బల్లి పడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం విజయనగరం జిల్లా పార్వతిపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పార్వతీపురం పట్టణంలోని గెంబలి వారి వీధిలో ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో బల్లి పడింది. ఈ విషయం ఆ ఆహారాన్ని 27 మంది విద్యార్థులు తిన్నారు. అనంతరం వాంతులు చేసుకోవడంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతిపురం రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీ చేశారు. పిల్లలకు వండి, వడ్డించే సమయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
softwear emply: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానస్పద మృతి


విజయవాడ నగరంలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఉషా అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. రెండేళ్ల క్రితం ఫణి అనే వ్యక్తిని ఉషా ప్రేమ వివాహం చేసుకుంది. కాగా అత్తింటి వారే ఉషను చంపారంటూ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
gold:10 కేజీల బంగారంతో పరార్(AP CRIME NEWS)


బంగారు ఆభరణాలు చేసే ఓ వ్యక్తి బంగారం వ్యాపారులకు టోకరా పెట్టాడు. 10 కిలోల బంగారంతో పరారయ్యాడు. ఈ సంఘటన మంగళగిరి పరిధిలో చోటు చేసుకుంది. పరారైన దిలీప్ కుమార్‌పై 9 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఆభరణాల తయారీ చేసేందుకు దిలీప్ కు బంగారం ఇచ్చినట్టు పోలీసులకు బాధితులు తెలిపారు. బంగారం బ్యాగు చోరీకి గురైనట్టు తన ఇంట్లో లేఖ రాసిపెట్టి దిలీప్ పరారైనట్టు తెలుస్తోంది. విజయవాడ బస్టాండులో బంగారం బ్యాగు పోయిందని ఆ లేఖలో పేర్కొన్నాడు.
king cobra:ఆరు అడుగుల తాచు పాము హల్చల్!


జంగారెడ్డి గూడెం మండలం పాత బస్‌స్టాండ్ సమీపంలో ఉన్న విష్టు ప్రియ రైస్ మిల్లులో 6 అడుగుల త్రాచుపాము ప్రవేశించింది. వడ్లు బస్తాలు తీసే క్రమంలో పాము బయటకు రావడంతో పనిచేస్తున్న కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణంలోని అందుబాటులో ఉన్న ఎస్ఎస్ఎస్ సంస్థకు సమాచారం ఇవ్వగా సంస్థ అధ్యక్షులు చదలవాడ క్రాంతి వచ్చి కార్మికులకు ఎటువంటి ప్రమాదం లేకుండా పామును సురక్షితంగా పట్టుకున్నారు.
gas tanker: పేలిన గ్యాస్ ట్యాంకర్ ఇల్లు ధ్వసం


విజయనగరం పట్టణంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. కాకినాడ నుంచి వచ్చిన గ్యాస్ ట్యాంకర్‌కు మరమ్మతులు చేస్తుండగా ఖాళీ ట్యాంకర్ పేలినట్టు సమాచారం. పేలుడు దాటికి ప్రక్కనే ఉన్న రెండు ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్ధానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో గ్యాస్ వెల్డింగ్ చేస్తున్న ఒకరికి గాయాలు అయ్యాయి. అతడిని జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ పేలుడు జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఖాళీ ట్యాంకర్ కావడంతో భారీ ప్రమాదం తప్పిందని వారు తెలిపారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?