Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి కత్తులు స్వాధీనం, పలువురు అరెస్టుTiruvuru : సంక్రాంతి సమీపిస్తున్న వేళ పందెం కోళ్ల రాయుళ్లు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేదని, పందాలు నిర్వహిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా తిరువూరు, విస్సన్న పేట పోలీసులు కోడి కత్తుల స్థావరాలపై దాడులు నిర్వహించారు.
అమ్మేందుకు సిద్ధంగా ఉన్న కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంప్రదాయాలు నడుమ జరపవలిసిన సంక్రాంతి వేడుకలను, చట్ట వ్యతిరేక కార్యకలాపాల మధ్య జరపరాదని, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు.
నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో తిరువూరు సిఐ ఎం.శేఖర్ బాబు పర్యవేక్షణలో తిరువూరు ఎస్సై ఎం.సుబ్రమణ్యం మరియు అవినాష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. తిరువూరు టౌన్‌లోని మధిర రోడ్లో కోడికత్తులు తయారు చేస్తున్న కర్మాగారం వద్దకు వెళ్లి 90 కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు.
తయారు చేస్తున్న కందుకూరి నాగాచారి మరియు తూముల రమణాచారి ని అదుపులోకి తీసుకున్నారు. కోడి కత్తులు తయారీకి ఉపయోగించే ముడి సరుకును పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిద్దరిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా విస్సన్నపేట పోలీసులు కూడా దాడులు నిర్వహించి 96 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. తయారు చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు.
ఇది చదవండి: పూడుపాముల స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఇది చదవండి: ఏనుగు దాడిలో రైతుకు తీవ్రగాయాలు