Tiruvuru Murder Case: కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని ఓ హత్య సంచలనం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా తిరువూరు పట్టణంలో మర్డర్ వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తిరువూరు బస్టాండ్ ఆవరణంలో ఓ యువకుడిని బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు కొందరు గుర్తు తెలియని(Tiruvuru Murder Case) వ్యక్తులు.
వివరాల్లోకి వెళితే..పేకాటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పాత కక్షల నేపథ్యంలో యువకుడు కళ్యాణపు కృష్ణ చైతన్య(26)ను దారుణంగా హత్య చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.భీమరాజు చేరుకున్నారు. అయితే యువకుడి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం నిందితులను మీడియ ఎదుట ప్రవేశపెట్టనున్నట్టు పోలీసు వర్గాల నుండి అందుతున్న సమాచారం.

నిందితులను పట్టుకునేందుకు డిఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.భీమరాజు, ఎస్సైలు సిహెచ్.దుర్గా ప్రసాద్, కిషోర్ వి.సతీష్, ఎం.లక్ష్మణ్, ఏ పద్మారావు, సుబ్రమణ్యం క్రియాశీలకంగా వ్యవహరించారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!