Tiruvuru Municipal Chairman : Tiruvuru : కృష్ణా జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్ పర్సన్(Tiruvuru Municipal Chairman)గా స్థానిక 3వ వార్డు కౌన్సిలర్ గత్తం కస్తూరి బాయి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 2014 లో కూడా ఆమె 2వ వార్డు నుండి కౌన్సిలర్ గా ఎన్నికై నగర పంచాయతీలో ప్రజా సమస్యలపై గళమెత్తారు. గత పాలక వర్గం ఆమె ప్రస్తావించిన సమస్యలను పెడ చెవిన పెట్టినా మొక్కవోని ధైర్యంతో అధికార పక్షంతో పోరాడారు. ఇప్పుడు అదే వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన కస్తూరి బాయిని ఛైర్పర్సన్ పదవి వరించింది.
బీఏబీఈడీ అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన ఆమె 1973 నుంచి 2010 వరకు సాంఘీక సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సేవలందించారు. 2000, 2004, 2006, 2008 సంవత్సరాలలో ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. భర్త గత్తం నాగేశ్వరరావు ప్రోత్సాహంతో 2011 లో వైయస్సారీపీ లో చేరిన కస్తూరి బాయి స్థానిక సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారు. కస్తూరి బాయి నాయకత్వంలో తిరువూరు పట్టణ సమస్యలకు సత్వర పరిష్కారం లభించడంతో పాటు అభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతాయని పలువురు ఆశిస్తున్నారు.

తిరువూరు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు ఘన సన్మానం
తిరువూరు నగర పంచాయతీకి నూతనంగా ఎన్నిక కాబడిన ఛైర్ పర్సన్ గత్తం కస్తూరిబాయి, వైస్ ఛైర్మన్ వెలుగోటి విజయ లక్ష్మీ ను తిరువూరు సువర్ణ ఫ్రెండ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా వెలుగోటి ఆదినారాయణ, గత్తం నాగేశ్వరరావు, యువజన సంఘం నాయకులు కర్రె సుందరం, విష్ణు, జివి.కృష్ణరావు, రాధా కృష్ణ, రాజా, ప్రసాదరావు, యాదగిరి, కర్రె రవి తదితరులు పాల్గొన్నారు.
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి
- Tiger Kid : మద్రాస్ సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్ల? | Jaggayyapeta Madras Cement Factory