Tiruvuru in Murder Story

Tiruvuru in Murder Story: 30 ఏళ్లుగా అదే బ‌స్టాండ్ అడ్డాగా నాలుగు మ‌ర్డ‌ర్లు

Andhra Pradesh

Tiruvuru in Murder Story: కృష్ణ జిల్లా తిరువూరు ప‌ట్ట‌ణం ఇప్పుడు వార్త‌ల్లో నిలుస్తోంది. ఎక్క‌డో పెద్ద పెద్ద న‌గ‌రాల్లో జ‌రిగే హ‌త్య‌లు, ఫ్యాక్ష‌నిస్టు చరిత్ర‌లు తిరువూరు ప‌ట్ట‌ణంలో కూడా వినిపిస్తున్నాయి. 30 సంవ‌త్స‌రాల వెన‌క్కి చూసుకుంటే తిరువూరు ప‌ట్ట‌ణంలో నాలుగు మ‌ర్డ‌ర్లు జ‌రిగాయ‌ని నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ నాలుగు మ‌ర్డ‌ర్లు తిరువూరు ఆర్‌టీసీ బ‌స్టాండ్ ప్రాంతంలోనే జ‌ర‌గడం మ‌రో సంచ‌ల‌నంగా(Tiruvuru in Murder Story) మారుతోంది.

30 ఏళ్లు 4 మ‌ర్డ‌ర్లు!

1993లో తిరువూరు తిరునాళ్లులో యువ‌తిని వేధిస్తున్నాడ‌నే కార‌ణంతో వెలుగోటి సురేష్ అనే యువ‌కుడిని పుచ్చ‌కాయ‌లు క‌త్తితో దారుణంగా చంపిన రావు మోహ‌న‌రావు అలియాస్ కుంటి చెయ్యి మోహ‌న్‌రావు. ప్ర‌తీకారంగా సంవ‌త్స‌రం తిర‌క్క‌ముందే కుంటి చెయ్యి మోహ‌న‌రావును బ‌స్టాండ్ వెనుక డిఎం నివాస గృహం వ‌ద్ద క‌త్తుల‌తో మానికొండ రాము బ్యాచ్ న‌రికి చంపారు.

1995లో సిటీ కేబుల్ యజ‌మాని దారా ల‌క్ష్మీ కాంతారావును డ‌బ్బులు డిమాండ్ చేసినా ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో బ‌స్టాండ్ సమీపంలో ప్ర‌ధాన ర‌హ‌దారిపై స్వ‌ర్ణ‌లాడ్జి వ‌ద్ద క‌త్తుల‌తో మానికొండ రాము బ్యాచ్ న‌రికి చంపింది. అదే విధంగా గ‌త రాత్రి మ‌ర్డ‌ర్ జ‌రిగిన ప్రాంతంలో 15 ఏళ్ల క్రితం ఎల‌క్ట్రీషియ‌న్ బాబు అనే వ్య‌క్తిని కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో పెరుమాళ్ల వెంక‌న్న హ‌త్య చేశాడు.

ఆర్థిక వివాదాలు, పాత కక్ష‌లు నేప‌థ్యంలో ఇదే సెంట‌ర్లో గ‌త రాత్రి హ‌త్య‌కు గురైన క‌ళ్యాణ‌పు కృష్ణ చైత‌న్య‌(నాని) ఘ‌ట‌న‌తో మ‌రో సారి తిరువూరు ఉలిక్కిప‌డింది. తిరువూరులో మ‌ర్డ‌ర్ల‌కు కేంద్ర బిందువుగా బ‌స్టాండ్ సెంట‌ర్ మారింద‌ని స్థానికులు చెప్పుకుంటూ గ‌త చ‌రిత్ర‌ను గుర్తు చేసుకుంటున్నారు.

బ‌స్టాండ్ సెంట‌ర్‌లో గ‌త రాత్రి జ‌రిగిన హ‌త్య‌

సిటీ కేబుల్ యజ‌మాని దారా ల‌క్ష్మీ కాంతారావును చంపిన మానికొండ రామును అప్ప‌ట్లో తిరువూరు వ్యాపార‌స్థులు ఏక‌మై చందాలు ఇచ్చి అప్ప‌టి పోలీసు అధికారి ఠాగూర్ నేతృత్వంలో ఎన్‌కౌంట‌ర్ చేసి హ‌త‌మార్చిన‌ట్టు చ‌రిత్ర చెబుతోంది. అయితే అప్ప‌టి వార్తా క‌థ‌నాల్లో మాత్రం మానికొండ రాము పారిపోయాడ‌ని వ‌చ్చాయి. ఏదేమైనా తిరువూరు ప‌ట్ట‌ణం, బ‌స్టాండ్ సెంట‌ర్ ఇప్పుడు హ‌త్య‌ల‌కు అడ్డాగా మారింద‌నేది గ‌త వాస్త‌వాలు చెబుతున్నాయి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *