ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

International Calls: అంత‌ర్జాతీయ కాల్స్‌ను లోక‌ల్ కాల్స్‌గా మార్చే ముఠా గుట్టుర‌ట్టు!

International Calls: తిరుప‌తి అంత‌ర్జాతీయ కాల్స్‌ను వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్ నెట్ ప్రోటోకాల్ ప‌ద్ధ‌తి ద్వారా లోక‌ల్ కాల్స్‌గా మార్చే ముఠాను అరెస్టు చేసిన‌ట్టు తిరుప‌తి అడిష‌న‌ల్ ఎస్పీ ముని రామ‌య్య గురువారం తెలిపారు. క‌న్నం ర‌వికుమార్‌, అరిగ‌ల హ‌రి ప్ర‌కాష్‌, నీలం కిర‌ణ్ కుమార్‌, మ‌చ్చ శేష‌ప‌ణి, నారాయ‌ణ పార్థ‌సార‌థి, ఓరుకొండ శ్రీ‌నివాసులను అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు.

వీరి వ‌ద్ద నుండి నాలుగు టెలికామ్ గేట్ వేలు, 116 యాక్టివ్ సిమ్‌(sim)లు, మూడు ఇంట‌ర్ నెట్ మోడెం(internet modem)లు, కంప్యూట‌ర్లు, ల్యాప్ టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను అరెస్టు చేసి మీడియా ఎదుట హాజ‌రుప‌ర్చారు. ఈ స‌మావేశంలో అడిష‌న‌ల్ ఎస్పీతో పాటు భార‌త క‌మ్యూనికేష‌న్ సెక్యురిటీ డైరెక్ట‌ర్ మ‌నోజ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

See also  Ys Sunitha Reddy: వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు నివాసం వ‌ద్ద రెక్కీ...ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఎస్పీకి ఫిర్యాదు

Comment here