Red Sandalwood

Red Sandalwood : ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు అరెస్టు | Tirupati Forest Department

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Red Sandalwood : ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు అరెస్టు | Tirupati Forest Department

Red Sandalwood : తిరుప‌తిలోని ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా నిరోధ‌క టాస్క్ ఫోర్స్ క‌ర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండ‌లంలోని ర‌వాణా చేస్తున్న 12 ఎర్ర చంద‌నం(Red Sandalwood) దుంగ‌ల‌ను మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున స్వాధీనం చేసుకున్నారు. వీటిని మోసుకొని వ‌స్తున్న న‌లుగురు స్మ‌గ్ల‌ర్ల‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

అనంత‌పురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేర‌కు డీఎస్పీలు కేసీ వెంక‌ట‌య్య‌, వివి గిరిధ‌ర్‌, ముర‌ళీధ‌ర్ ల ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప స‌బ్ కంట్రోల్ ఆఫీసుకు చెందిన ఆర్ఐ ర‌వికుమార్ క‌ర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండ‌లం తోళ్ల మ‌డుగు గ్రామం స‌మీపంలోని అడ‌వుల్లోని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వ‌ద్ద త‌నిఖీలు చేప‌ట్టారు. స‌మీపంలోని చీనీ తోట నుంచి కొంద‌రు ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను మోసుకొని వ‌స్తూ క‌నిపించారు.

స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్టు చేసిన ఫారెస్ట్ అధికారులు

దీంతో ఆర్ఐ ర‌వికుమార్ త‌న సిబ్బందితో వారిని అడ్డ‌గించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల‌ను చూసి పారిపోయే ప్ర‌య‌త్నం చేశారు. అయితే వారిలో న‌లుగురిని ప‌ట్టుకున్నారు. వారిని అదే ప్రాంతానికి చెందిన త‌లారి ర‌మేష్ (25), వి.కేశ‌వులు (36), జి.బాజ్జీ (43), ఎం.పాల్ (25) గా గుర్తించారు. వీరు ఎర్ర చంద‌నం దుంగ‌లు సేక‌రించి, చీనీ తోట‌లో దాడి త‌మిళ స్మ‌గ‌ర్ల‌కు అమ్ముదామ‌నుకున్నారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *