tips on investment నెలకు వచ్చిన జీతం అంతా ఖర్చైపోతున్నదని, ఏమాత్రం లెక్క తెలియడం లేదని అనేక మంది బాధపడుతూ ఉంటారు. కొద్ది మంది మాత్రం ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, కిరాణాషాపులో కట్టిన డబ్బు లాంటి కొన్ని అతి ముఖ్యమైన ఖర్చులను మాత్రమే రాసుకుంటూ ఉంటారు. రోజువారీగా చిల్లరగా ఖర్చయ్యే వాటికి లెక్కలు ఉండవు. దీంతో డబ్బులు ఎలా, ఎందుకు ఖర్చవుతున్నాయో లెక్కుండదు. ఇక ఆదా చేసుకోవడానికి అసలేమైనా మిగిలితే కదా!. కాబట్టి డబ్బు ఆదాకు ఇక నుంచి అనేక మార్గాలను తెలుసుకోండి! నూతన సంవత్సరం నుండి డబ్బు ఆదా చేయడానికి సిద్ధం(tips on investment) కండి.

లెక్క తేలాలి!
రోజువారీగా ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారనే విషయాలను తప్పకుండా లెక్క రాసుకోవాలి. లెక్కలు రాసుకోవడానికి సమయం దొరకడం లేదని అనుకోనవసరం లేదు. సాంకేతికాభివృద్ధి కారణంగా అందరూ మొబైల్‌లను వాడుతున్నారు. వాటిలో లెక్కలు రాసుకోవడానికి అవసరమైన యాప్(Apps)లు ఉన్నాయి. బట్టలు కొన్నా? ఇంటి సామాను కొన్నా? హోటళ్లలో ఖర్చు అయినా, బ్యూటీ పార్లర్ల ఖర్చుతో సహా ఇలాంటివన్నీ లెక్క రాసుకోవాలి. అప్పుడు ఎంత ఖర్చవుతుందో గమనించాలి. తదనుగుణంగా మార్పులు చేసుకుంటే ఖర్చులు(tips on investment) తగ్గించుకోవచ్చు.
నగదుతోనే కొనండి!
నేడు క్రెడిట్ కార్డులు వాడటం స్టేటస్‌కు చిహ్నంగా భావిస్తున్నారు కొందరు. కానీ, దీని వల్ల నష్టాలున్నాయనే విషయాన్ని గుర్తించాలి. కొన్నిసార్లు బ్యాంకులు డెబిట్(debit), క్రెడిట్(credit) కార్డుల మీద మనీబ్యాక్ని ప్రకటిస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మాత్రమే కార్డులను ఉపయోగించడం ఉత్తమం. మామూలు సమయాల్లో ఏదైనా కొనాలనుకుంటే నగదును మాత్రమే ఇవ్వాలి. కానీ ఏదైనా వస్తువు కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనాలనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.

ఇంట్లోనే వంట!
రోజువారీ పనులతో ఒత్తిడికి లోనవుతూ ఈ రోజు బయట తినేద్ధాం అనుకుంటున్నారు. అయితే మీ ఆరోగ్యం గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఎన్ని పనులతో సతమతమవుతున్నా సరే ఇంట్లోనే వంట చేసుకుని తినాలనే నియమం పెట్టుకోండి. సరదాగా ఎప్పుడైనా ఒకసారి హోటల్‌కు వెళ్లి భోజనం చేసినా, తెప్పించుకున్నా పర్వాలేదు కానీ దానినే ఒక అలవాటుగా మార్చుకోరాదు.
ఒత్తిడిలో షాపింగ్(shopping) వద్దంటే వద్దు!
మనం అనేక సందర్భాల్లో రకరకాల ఖర్చులు చేస్తుంటాం. అవి ఎందుకు చేస్తామో మనకే అర్థం కాదు. ఆనందంగా ఉన్నప్పుడే కాదు, బాధగా ఉన్నప్పుడూ, ఏదైనా కారణం చేత మూడ్ పాడైనప్పుడూ కూడా అర్థం లేకుండా ఖర్చు పెడుతుంటారు చాలా మంది. ఇలాంటి వాటి వల్ల పర్సు ఖాళీ కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. నిజానికి ఇలాంటి సమయాల్లో వాకింగ్ కు వెళ్లడమో, చక్కని సంగీతం వినడయో చేయవచ్చు. దానితో మళ్లీ మూడ్ ఫ్రెష్‌గా తయారవుతుంది.
కొనేముందు ఆలోచించండి!
ఏదైనా ఒక వస్తువును కొనాలనుకునే ముందు ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతేకాదు, కొనే వస్తువుల రేట్లను పరిశీలించుకోండి. తక్కువుగా వస్తున్నాయని అవసరం లేకపోయినా కొనడం వృథా ఖర్చే కదా! పప్పులు, బియ్యం వంటి నిలువ ఉండే వస్తువుల ధర తక్కువుగా ఉన్నప్పుడే కొని నిలువ చేసుకోవడం మంచిది. ఏదైనా కొత్త వస్తువు కొనాలనుకునే ముందు ఒకటి రెండు రోజుల సమయం తీసుకోవాలి. అప్పుడు ఆ వస్తువు అవసరం లేదనిపిస్తే…మీ డబ్బులు మిగిలిపోయినట్లే కదా!

మీ అల్మారాలోకి చూడండి!
కొంత మంది ప్రతి చిన్న ఫంక్షన్లకు కొత్త బట్టలు కట్టుకుని వెళ్లాలనుకుంటారు. వెంటనే షాపింగ్ చేసేస్తారు. ఇటువంటి సమయాల్లో ముందు మీ అల్మారాలోకి ఒకసారి తొంగి చూడండి. రకరకాల దుస్తులు మిమ్మల్ని అలరిస్తూ కనిపిస్తాయి. వాటిలో నుంచి ఎంపిక చేసుకోండి. వృథా ఖర్చు తగ్గిందని మీరే ఆనంద పడతారు.
చిల్లర దాచుకోండి!
కిడ్డీ బ్యాంకు(kiddy bank)లో చిల్లర దాచుకున్న రోజులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇదే పద్ధతిని మీ దగ్గర జమ అయ్యే చిల్లరను దాచుకోవడానికి ఉపయోగించండి. అలా దాచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. ఏడాది తిరిగే సరికి ఎంత మొత్తమవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కొనుక్కోవాలనుకున్న వస్తువును హాయిగా కొనుక్కోవచ్చు.
అమ్మాయిల పొదుపు ఇలా!
చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చిన అమ్మాయి(women job)లు ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దీనివల్ల పెళ్లి తర్వాత పొదుపు ప్రణాళిక రూపొందించుకోవడం సులవుతుంది. డబ్బుకి ఎలాంటి లోటూ లేకుండా సంతోఫంగా గడపొచ్చు. జీతం అందుకుంటున్న మొదటి నెల నుంచే ప్రతి ఒక్కరికీ తమ ఖర్చులకు ఎంత కావాలి? ఎంత మిగులుతుంది? అమ్మానాన్నలకు ఎంత పంపాలి. అన్న విషయాలపై అవగాహన వచ్చేస్తుంది. వాటిని దృష్టిలో ఉంచుకుని ఎంత పొదుపు చేయొచ్చన్న దానిపై ఓ అంచనాకొచ్చి ప్రతి నెలా డబ్బు దాచుకోవడం మొదలు పెట్టాలి. దాన్ని ఓ బాధ్యతగా భావించండి. అనుకోకుండా వచ్చే అవసరాలు మనకు ముందుగా తెలియవు కనుక, వాటికి ఈ డబ్బులు ఉపయోగపడే అవకాశం ఉంది.

జీతంలో ఎక్కువ మొత్తం మిగిలేట్టయితే పెళ్లికొ కొంత, పెళ్లి తర్వాత ఇల్లు కొనడం వంటి అవసరాల కోసం కొంత అనుకుని పొదుపు చేయాలి. అన్ని ఖర్చులయ్యాక మిగిలితే పొదుపు చేద్ధాం అనుకోవడం వల్ల ఫలితం ఉండదు. కొంత మొత్తం పొదుపుకోసం పక్కన పెట్టాకే, జీతాన్ని ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి.
పిల్లల(children)కి పొదుపు పాఠాలు నేర్పండి!
మనం సాధారణంగా పిల్లల్ని తీసుకుని ఏటీఎం కేంద్రాలకు వెళ్తుంటాం. అప్పుడు మనల్ని చూసి వాళ్లు చిన్న కార్డుతో దాన్నుంచి డబ్బులు తీసుకోవచ్చని భావిస్తారు. మీరెంత కష్టపడి పనిచేస్తే ఆ డబ్బు ఏటీఎంలోకి వస్తుందనేది వాళ్లకు తెలియకపోవచ్చు. కాబట్టి డబ్బు సంపాదించడం, దాన్ని పొదుపు చేయడం గురించి వాళ్లకు సందర్భోచితంగా తెలియజేయాలి.
రాబోయే పిల్లల పుట్టిన రోజుకు మీరు కొంత డబ్బు ఖర్చు చేయాలనుకుంటారు కదా..దాన్ని వాళ్ల చేతికే ఇచ్చి పొదుపు చేసేలా చూడండి. అంటే పిల్లల చేతికి ఓ డబ్బా ఇచ్చి దానిపై పుట్టిన రోజు అనే స్టిక్కర్‌ని అతికించండి. అందులో తరుచూ వాళ్ల చేత కొంత డబ్బు వేయించి, అవసరమైనప్పుడు తీయండి. అంతకన్నా కాస్త చిన్న డబ్బాను వాళ్లకిచ్చి అందులో వాళ్ల పాకెట్ మనీ నుంచి కొంత మొత్తాన్ని వేయమనండి. అది నిండాక వాళ్లకు నచ్చిన వస్తువు కొనుక్కునేలా ప్రోత్సహించండి. దీని వల్ల పిల్లలకు డబ్బు పొదుపు విషయంలో లక్ష్యాలు పెట్టుకోవడం అలవాటవుతుంది.

పిల్లల బ్యాగు కావాలన్నారనుకోండి. అది బ్రాండెడ్ కానక్కర్లేదు. ఏదైనా తినాలనిపిస్తే ప్రతిసారీ బయటకు వెళ్లే తినాలని లేదు. ఇంట్లోనూ చేసుకోవచ్చు. బ్రాండెడ్ వస్తువులూ, బయటికి వెళ్లి తినడం అంటూ కోరికలు పెట్టుకోవడం వల్ల డబ్బు వృథా అవుతుందని వివరించండి. అలా చెప్పడం వల్ల కోరికకూ, అవసరానికి మధ్య ఉన్న తేడా వాళ్లకు తెలుస్తుంది.
పిల్లలు ఏదైనా అడిగినప్పుడు నేను ఖర్చు చేయలేను..అది బాగా ఖరీదెక్కువ అని చెప్పడం వల్ల వాళ్లు అర్థం చేసుకోరు. దాన్నే మరో విధంగా చెప్పి చూడండి. ఫలానా ఖర్చు చేయడం కన్నా ఆ డబ్బును మరో విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించండి. దానివల్ల ఎంత డబ్బు ఆదా అవుతుందనేది తెలియజేయండి. మీరు భవిష్యత్ కోసం కొంత డబ్బు దాస్తున్నారనేది పిల్లలకు తెలియజేయండి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి