tips for glowing skin homemade | పని ఒత్తిడి ప్రభావం చర్మంపై పడుతుంది. దీంతో చర్మం త్వరగా ముడతలు పడి నిర్జీవంగా కాంతిహీనంగా తయారవుతుంది. అందుకే చాలా మంది తమ చర్మ రక్షణ కోసం బ్యూటీపార్లర్లప ఆధారపడుతుంటారు. అయితే ప్రతిరోజు #BeautyParlorకు వెళ్లడం సాధ్యం కాదు. అందుకే ఇంట్లోనే కొన్ని #Tips పాటిస్తే కాంతివంతమైన మృదువైన ముఖాన్ని పొందొచ్చు. దీని కోసం ఎక్కువుగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. క్లీనింగ్, స్టీమింగ్ స్క్రబ్బింగ్, ఫేషియల్, మాయిశ్చరైజింగ్ వంటి వాటిని పాటించి ఇంట్లోనే అందమైన ముఖాన్ని పొందుతారు.
tips for glowing skin homemade
Cleaning : ముఖాన్ని ఫేస్‌వాష్‌తో నైనా, ఫేషియల్ క్లీనర్ తోనైనా శుభ్రంగా కడుక్కోవాలి. మెత్తగా ఉండే టవల్‌తో తుడుచుకోవాలి. తర్వాత పచ్చిపాలల్లో కాటన్ ముంచి ముఖానికి పట్టించి మెల్లగా తుడవాలి.
Steaming: ఒక గిన్నె నిండా వేడి నీటిని తీసుకొని ముఖానికి 5-6 నిమిషాలు ఆవిరి పట్టించాలి. జిడ్డు చర్మం ఉన్న వారు మాత్రమే దీన్ని పాటించాలి. దీనివల్ల ముఖంపై జిడ్డు తొలిగిపోతుంది.
Scrubbing: రెండు టీ స్పూన్ల చక్కెర, రెండు టీ స్పూన్ల తేనెను కలిపి మిశ్రమం తయారు చేయాలి. దీంతో ఐదు నిమిషాల పాటు మెల్లగా ముఖానికి మర్దనా చేయాలి. ఆరిన తర్వాత కడగాలి. దీనివల్ల చర్మం నిర్జీవంగా కనిపించదు.
Facepack: పొడి చర్మం ఉన్న వాళ్లు గులాబీ నీటిలో గంధపు పొడిని కలిపి పేస్టులా చేసుకోని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. జిడ్డు Skin ఉన్న వాళ్లు గులాబీ నీటిలో Multani మట్టి కలిపి ముఖానికి పట్టించి తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు గ్రంథులు తొలిగిపోతాయి.
Tuning: మీ ఇంట్లోనే ట్యూనర్‌ని తయారు చేసుకోవచ్చు. గులాబీ నీటిలో దోసకాయ రసాన్ని కలిపి ముఖానికి పట్టించాలి. ఇది శరీరంలో #PH స్థాయిని సమానంగా ఉంచడానికి (tips for glowing skin homemade) సహాయపడుతుంది.
Moisturizer: చివరగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ముఖానికీ, మెడకు మాశ్చరైజర్‌ను పట్టించండి. ఇలా వారానికోసారి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Papaya Fruitతో అందం మెరుగు
పొప్పడి పండులో పోషకాలతో పాటు, అందాన్ని పెంచే గుణాలు పుష్కలం. ఏ చర్మతత్వం వారైనా పొప్పడితో Face packలు వేసుకోవచ్చు. అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. పొప్పిడిపండు గుజ్జులో తేనె, గంధం ఒక్కో టేబుల్ స్పూన్ కలుపుకొని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పొప్పిడి ముక్కలను గుజ్జుగా చేసి ఒక టేబుల్ స్పూ్ తేనె, పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ ప్యాక్ మాయిశ్చరైజర్‌గా డ్రై స్కిన్ వారికి బాగా పని చేస్తుంది.


జిడ్డు చర్మం వాళ్లు పొప్పిడి గుజ్జులో ముల్తాని మట్టని కలిపి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిపోయేదాకా ఉంచుకుని తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ముల్తాని మట్టి ముఖంపై ఉన్న అదనపు #Oil గ్రహిస్తుంది. పొప్పడి మృదుత్వాన్ని అందిస్తుంది. Acne బాధిస్తున్నట్టయితే ఈ Pack ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.