Tinnitus Treatmentబయట అలాంటి చప్పుళ్లేవీ ఉండవు. కానీ చెవిలో ఒకటే హోరు పెడుతుంటాయి. పక్కవారికి చెప్పినా అర్థం కాదు. ఇలాంటి చిత్రమైన సమస్యే చెవిలో రింగుమనే మోత (టినిటస్), కొందరికి ఈల శబ్ధం..మరికొందరికి కిచకిచలు.. లేదా రకరకాల చప్పుళ్లు కలగలిసి వినబడుతుంటాయి. చిత్రమైన విషయమేంటంటే టినిటస్కు బయటి అంశాలేవీ కారణం కాదు. అలాగని సమస్య నిజం కాదని అనుకోవడానికీ లేదు. టినిటస్తో బాధపడేవారి మెదడు పనితీరులో మార్పులు తలెత్తుతున్నట్టు పరిశోధకులు (Tinnitus Treatment)గుర్తించారు.


దీని బారిన పడ్డ కొందరిలో వినికిడి లోపం కూడా ఉంటుండటం గమనార్హం. ఈ రెండు సమస్యలూ గలవారికి వినికిడి సాధనం లేదా కాక్లియర్ ఇంప్లాంట్‌తో మంచి ఫలితం కనబడుతున్నట్టూ తేలింది. కెఫీన్, మద్యం, కొవ్వు పదార్థాలు తగ్గించడం, పొగ తాగడం మానేయడం ద్వారా కొంత వరకు ఉపశమనం కలుగుతున్నట్టు మరికొందరు చెబుతున్నారు. టినిటస్ లక్షణాలు తగ్గడానికి కొన్ని చికిత్సలు, పద్ధతులు బాగా తోడ్పడతాయి.
నిశ్శబ్ధమైన గదిలో ఉన్నప్పుడు సంగీతం లేదా ఒకే శ్రుతిలో ఉన్న స్వరాలు (white noise) వినడం మేలు. దీంతో టినిటస్ చప్పుడు నెమ్మదిగా దానిలో కలిసిపోయి ఉపశమనం కలుగుతుంది. వినిగికి సాధనానికి వైట్ నాయిస్ పరికరాన్ని(టినిటస్ మాస్కర్) కూడా అమర్చుకోవచ్చు. ఇప్పుడు టినిటస్ మాస్కర్(tinnitus masker)తో కూడిన వినికిడి సాధనాలూ లభిస్తున్నాయి. చెవిలో హోరుకు మెదడుకు తర్భీదునిచ్చే చికిత్స (టినిటస్ రిట్రైనింగ్) బాగా ఉపయోగపడతుంది. కాకపోతే ఇది ఖరీదైనది.


దీర్ఘకాలం పడుతుంది కూడా. ఇందులో చెవిలో హోరును పోలిన స్వరాలను దీర్ఘకాలం పాటు వినిపిస్తారు. దీంతో క్రమంగా మెదడు ఈ స్వరాలతో పాటు హోరునూ పట్టించుకోని విధంగా మారుతుంది. చెవిలో హోరుతో బాధపడేవారు ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా కీలకం. ధ్యానం,యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు చెవిలో హోరు వంటి చికాకు పరిచే అంశాల నుంచి దృష్టి మళ్లేలా చేస్తాయి. కొందరికి హిప్నోసిస్తోనూ ఉపశమనం కలగొచ్చు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!