Tiger Entry in Penuballi పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయ గూడెం గ్రామ సమీపంలో వరి పొలంలో పెద్ద పులి అడుగుజాడలను ఫారెస్టు సిబ్బంది గుర్తించారు. గత రెండు రోజుల నుంచి నీలాద్రి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి జాతీయ రహదారిని దాటి జనావాసాల సమీపంలో సంచరిస్తున్నట్టు అధికారులు తేల్చారు. ఈ క్రమంలో ఓ రైతు వరి పొలంలో పులి అడుగు జాడలను (Tiger Entry in Penuballi)చూడటంతో సమీప గ్రామస్థులు మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత కారాయగూడెం గ్రామ సమీపంలో చీకటి రామయ్య మామిడి తోటలో పెద్దపులి ఫెన్సింగ్ దాటే క్రమంలో పెన్సింగ్ తీగకి పులి వెంట్రుకలు చిక్కుకున్నట్టు ఫారెస్టు అధికారులు గుర్తించారు. పెద్ద పులి సంచారం సమీప గ్రామాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఏ గ్రామంలోకి వస్తుందేమోనని నిద్ర కూడా పోని పరిస్థితి నెలకొంది. త్వరగా పులిని కొనుగొని బంధించాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!