Passenger Trains: హైదరాబాద్: సోమవారం నుంచి పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్ల వేగంతో పాటే ఛార్జీల పెంపుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. దీంతో ఇక ప్యాసింజర్ ఎక్కి ప్రయాణం చేసే సామాన్యులకు భారం పడనుంది. కరోనా కారణంగా గతేడాది 2020 మార్చి 22 నుంచి ప్యాసింజర్ రైళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ పునరుద్ధరించారు.
సోమవారం నుంచి 82 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు కేవలం రూ.50 లో పు ఛార్జీలతో రాకపోకలు సాగించిన ప్రయాణికులు ఇక నుంచి ఈ రైళ్లలో ఎక్స్ ప్రెస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ప్యాసింజర్ ఛార్జీలపైన 30 నుంచి 40 శాతం వరకు భారం పడనుంది. ఈ రైళ్లన్నింటినీ అన్ రిజర్వ్డ్ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చడంతో అటోమెటిక్‌గా ఛార్జీలు సైతం పెరగనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కోవిడ్‌కు ముందు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో నడిచిన ఈ రైళ్లు సోమవారం నుంచి గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. రైళ్ల వేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన రూట్లలో పట్టాల సామర్థ్యాన్ని పెంచింది. ఇప్పటి వరకు రిజర్వరేషన్ టికెట్ల తరహాలోనే జనరల్ సీట్లకు సైతం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి అన్ని రైల్వే స్టేషన్లలో కౌంటర్ల ద్వారా ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని ప్రయాణం చేయవచ్చు. ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్(ఏటీవీఎం)(automatic ticket vending machine) యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?