thyroid symptoms

thyroid symptoms: థైరాయిడ్‌తో వ‌చ్చే స‌మ‌స్య‌లు ఇవే!

Health Tips

thyroid symptoms: శ‌రీరంలో ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒక‌టి. ఇది శ‌రీరం ఎదుగుద‌ల‌లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి ప‌నితీరు దెబ్బ‌తింటే హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం, గాయిట‌ర్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. వీటిని ఆదిలోనే గుర్తిస్తే త‌గిన చికిత్స‌ను అందించి పూర్తిగా న‌యం చేయ‌వ‌చ్చు.

థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠ‌ముడి కింద ఉంటుంది. ఇది సీతాకొక చిలుక రెక్క రూపంలో, శ్వాస నాళానికి ఇరు ప్ర‌క్క‌లా ఉంటుంది. ఈ గ్రంథి నుంచి విడుద‌ల‌య్యే థైరాయిడ్ హార్మోన్ ప్ర‌తి క‌ణంపైనా ప్ర‌భావం చూపి, శ‌రీరాన్ని నియంత్రించేందుకు సాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో త‌గినంత థైరాయిడ్ హార్మోన్ Thyroid hormone, లేక‌పోతే పిట్యూట‌రీ గ్రంథి ఈ అవ‌స‌రాన్ని గ్రహించి, థైరాయిడ్‌ను ఉత్తేజ‌ప‌రిచేందుకు థైరాయిడ్ స్టిమ్యూలేటింగ్ హార్మోన్‌ను విడుద‌ల చేస్తుంది.

thyroid symptoms: హైప‌ర్ థైరాయిడిజం అంటే?

థైరాయిడ్ గ్రంథి మ‌రీ ఎక్కువ హార్మోన్‌ను ఉత్ప‌త్తి చేయ‌డం వ‌ల్ల క‌లిగే ఇబ్బందినే హైప‌ర్ థైరాయిడిజం అంటారు. దీనివ‌ల్ల గొంతు వాపు, గుండె రేటు నిమిషానికి 100 కంటే ఎక్కువ పెర‌గ‌డం, న‌రాల బ‌ల‌హీన‌త‌, చికాకు, చేతులు వ‌ణ‌క‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, మామూలుగా తింటున్నా బ‌రువు కోల్పోవ‌డం, వేడి తట్టుకోలేక పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వీటితో పాటు జుట్టు రాలిపోవ‌డం, త‌ర‌చూ విరేచ‌నాలు, త‌ర‌చూ రుతుస్రావం ల‌క్ష‌ణాలు కూడా ఉండ‌వ‌చ్చు.

దీనికి వ‌య‌స్సును బ‌ట్టి చికిత్స ఉంటుంది. చిన్న వ‌య‌స్సులో ఉంటే యాంటీ థైరాయిడ్ మందుల‌తో త‌గ్గించ‌వచ్చు. పెద్ద వ‌య‌స్సులో వారిలో అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆప‌రేష‌న్ కూడా చేయాల్సి రావ‌చ్చు.

హైపో థైరాయిడిజం Hypothyroidism, అంటే?

థైరాయిడ్ గ్రంథి thyroid symptoms, మామూలు క‌న్నా త‌క్కువ‌గా థైరాయిడ్ హార్మోన్స్ ఉత్ప‌త్తి చేసే స్థితిని హైపోథైరాయిడిజం అంటారు. అల‌స‌ట‌, నీర‌సం, నిద్ర‌మ‌త్తు, ఏకాగ్ర‌త కోల్పోవ‌డం, దుర‌ద పుట్టించే పొడి చ‌ర్మం, ఉబ్బిన ముఖం, మ‌ల‌బ‌ద్ద‌కం, శ‌రీరం బ‌రువెక్క‌డం, త‌క్కువైన రుతుస్రావం, ర‌క్త‌హీన‌త వంటి లోణాలు క‌నిపించ‌వ‌చ్చు. ఈ ప‌రిస్థితిని మందుల ద్వారా త‌గ్గించ‌వ‌చ్చు. మొద‌ట్లోనే గుర్తించిన త‌గిన చికిత్స తీసుకుంటూ పూర్తిగా త‌గ్గించవ‌చ్చు.

గాయిట‌ర్ అంటే?

థైరాయిడ్ గ్రంథి పెర‌గ‌డాన్ని గాయిట‌ర్ అంటారు. ఇందులో రెండు ర‌కాలుంటాయి. యుక్త వ‌య‌స్సులో పెర‌గ‌డం, అంటే ఈ వ‌య‌స్సులో థైరాయిడ్ అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి పెరుగుతుంది. క్ర‌మేణ కొద్ది రోజుల్లో య‌థాస్థితికి వ‌స్తుంది. ఇది పెద్ద స‌మ‌స్య కాదు. రెండ‌వ ర‌కంలో ఒక వైపు మాత్ర‌మే గ‌డ్డ‌లాగా ఉండ‌వ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితి క‌లిగిన‌ప్పుడు వైద్యుణ్ణి సంప్ర‌దించ‌డం అవ‌స‌రం.

థైరాయిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే గ‌ర్భిణులు జాగ్ర‌త్త‌గా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. హార్మోన్ లోపిస్తే గ‌ర్భ‌స్రావ‌మ‌య్యే ముప్పు కూడా ఉంటుంది. త‌గిన చికిత్స తీసుకోక‌పోతే బ‌రువు, ర‌క్త‌పోటు పెర‌గ‌డంతో ముందుగానే కాన్పు అయ్యే అవ‌కాశ‌మూ ఉంటుంది. పుట్టిన పిల్ల‌ల్లోనూ బుద్ది వికాసం అంత‌గా ఉండ‌దు.మ‌న దేశంలో ఇటీవ‌ల ఎక్కువ మంది మ‌హిళ‌ల్లో ఈ స‌మ‌స్య క‌నిపిస్తోంద‌ని తాజా అధ్య‌యనాల్లో తేలింది. పురుషుల్లో కంటే మ‌హిళ‌ల్లోనే థైరాయిడ్ Thyroid, స‌మ‌స్య ఎక్కువ కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *