Thula Rasi 2023: నూతన సంవత్సరం రావడానికి ఒక నెల సమయం ఉంది. 2023 సంవత్సరంలో అంతా మంచి జరగాలని, మంచి పనులు చేయాలని అందరూ కోరుకుంటారు. ఇలాంటి సమయంలో కొందరు వారి రాశి ఫలాలను పరీక్షించుకుంటుంటారు. గడిచిన ఏడాది ఎలా ఉంది?. ఇప్పుడు నూతన సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వారి రాశి ఫలాలను బట్టి వారి ప్రణాళికలను రూపుదిద్దుకుంటారు.
కొంత మందికి 2022 సంవత్సరం పెద్దగా కలిసి రాకపోయి ఉండవచ్చు. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగాలు, ఇతర పనులు చేసేవారికి ఇబ్బందులు ఎదురై ఇబ్బంది పడి ఉండవచ్చు. నష్టాలను, బాధలను ఎదుర్కొనే ఉంటారు. అలాంటి వారికి ఈ నూతన సంవత్సరమైన 2023 ఏమి ఆహ్వానం పలకబోతోందో ఆస్ట్రాలజీ (Astrology) జ్యోతిష్యులు చెబుతున్నారు. కొందరు వారికి తెలిసిన ఆస్ట్రాలజీ (Astrology) పండితులను సంప్రదిస్తున్నారు. 2023 నూతన సంవత్సరం గురించి వారి రాశి ఫలాల (Thula Rasi 2023)ను అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్ధేశించేది మాత్రం కాలం. కాబట్టి కాలం ఎలా ఉంటే మన జీవితంలో మనం అలా ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్లాన్ వేసుకొని ఈ సమయానికి అది అయిపోవాలి, ఇది అయిపోవాలని కలలు కంటుంటారు. కానీ మనం అనుకున్న Plan అమలవ్వడం ఒట్టి భ్రమ అంటున్నారు జ్యోతిష్యులు. మన ప్లాన్ చేయాల్సింది ప్రకృతి. ప్రకృతి ఎలా స్పందిస్తే అలా నడుచుకోక తప్పదు. కావున దానిని ముందుగానే అంచనా వేయడానికి దోహదపడేదే ఆస్ట్రాలజీ అంటున్నారు పండితులు.
Thula Rasi 2023: తులా రాశి వారి ఫలితాలు
ఇక తులా రాశి వారికి 2023లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులా రాశి వారు ముఖ్యంగా పెద్దవారు అనగా 55 ఏళ్లు దాటిన వారంతా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆస్ట్రాలజీ పండితులు. ఎందుకంటే వీరికి చాదస్తం ఎక్కువ అవుతుందట. కోడళ్లతో, పిల్లలతో, అన్నదమ్ములతో గొడవలు పడతారట. కాబట్టి వీరు నెమ్మదిగా ఉండాలని, ఎలాంటి వాదోపవాదాలు చేయకుండా, ఎవర్నీ తిట్టకుండా ఉండాలని అంటున్నారు.
తులా రాశి వారు ఈ 2023లో అడగనిదే ఎవరికీ సహాయం చేయకూడదంట. ఆపాత్రదానం అస్సలు చేయకూడదంట. Thula Rasi వారిలో ముఖ్యంగా స్వాతి నక్షత్రం లో పుట్టిన అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే వారిని పొగిడితే ఏమైనా ఇస్తారంట. కావున ఈ రాశి అమ్మాయిలు
ఎవరి మాటలు చెప్పినా సులువుగా నమ్మేయ్యవద్దని చెబుతున్నారు. 2023లో ఎవరు ఎంత పొగిడినా ఆ సంతోషానికి, ప్రేమకు, ఎమోషనల్కు పడిపోవద్దని అంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త!
Thula Rasi 2023: తులా రాశి వారిని ఈ నూతన సంవత్సరం కొత్త శత్రువులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందట. వీరి నుండి జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇక ప్రభుత్వం ఉద్యోగం చేసే తులా రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే 2023లో వారిపై రైడింగ్ లు జరిగే అవకాశం ఉందట. ఇక లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండకపోతే కచ్చితంగా పట్టుపడతారని ఆస్ట్రాలజీ జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇక 8 సంవత్సరాల వయస్సు నుంచి 26 సంవత్సరాల వయస్సులో ఉండే టీనేజ్ వారికి మాత్రం గోల్డెన్ డేస్ అంట. 2023లో వారు చదువుల్లో రాణిస్తారంట. ఉద్యోగాలు చేసే అవకాశం ఉందట. ఇక బిజినెస్ రంగంలో అడుగుపెట్టే వారికి తిరుగులేదంట. తులా రాశి వారికి 2023 సంవత్సరంలో మార్చి 14 నుండి ఏప్రిల్ 14, ఆగష్టు 14 సెప్టెంబర్ 14, డిసెంబర్ 14 జనవరి 14 కలిసి వచ్చే శుభ గడియలు అని ఆస్ట్రాలజీ చెబుతుంది. ఈ రాశి వారు శివుడిని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ ప్రతిరోజూ పూజించడం కానీ, గుడికి వెళ్లడం కానీ చేయాలంట.