Throat Infection: సాధారణంగా చలికాలంలో జలుబు బాగా ఇబ్బంది పెడుతుంది. దీనికి తోడు గొంతు ఇన్ఫెక్షన్ కూడా తరుచూ వస్తుంటుంది. వీటిని అధిగమించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
Throat Infection: ఇంటి వైద్యంతో ఉపశమనం
ప్రతి ఒక్క ఇంట్లో పసుపుపొడి (turmeric powder) తప్పకుండా ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చి తీసుకుంటే సమస్యను త్వరగా దూరం చేస్తాయి. గొంతులో మంట, పట్టేసినట్టు నొప్పి విపరీతంగా బాధిస్తుంటే దాల్చిన చెక్, నూనె చెంచా తీసుకొని అందులో తేనె కలిపి తాగితే తక్షణం ఉపశమనం ఉంటుంది. అవసరమైతే వేడి నీటిలో తేనె వేసుకుని పుక్కలిస్తే ఎంతో మంచిది.
ఓ గ్లాసు వేడి నీటిలో దాల్చిన చెక్క (Cinnamon), మిరియాల పొడిని ఓ చెంచా కలపాలి. కాసేపైన తర్వాత వడకట్టి పుక్కలించాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయడం వల్ల సమస్య నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. అరకప్పు వేడి నీటిలో చెంచా శొంఠి పొడి, అర చెంచా నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి పుక్కలించాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే నొప్పి, మంట అదుపులోకి వస్తాయి.
అల్లంలో ఇన్ఫెక్షన్లు తగ్గించే గుణాలుంటాయి. గొంతు నొప్పి బాధపెడుతుంటే అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి నోట్లో వేసుకుని చప్పరించాలి. ఆ లాలాజలాన్ని మింగడం వల్ల నొప్పి తగ్గుతుంది. అల్లం టీ (Ginger Tea) తాగినా ఫలితం ఉంటుంది. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. వేణ్ణీళ్లకు ప్రాధాన్యమివ్వాలి. అన్నం కూడా కాస్త వేడిగా ఉన్నప్పుడే తినాలి. నిమ్మరసం కలిపిన వేణీళ్లూ బాగా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్ల (Throat Infection) ను తగ్గిస్తాయి. హెర్బల్ టీ తీసుకోవచ్చు.
మిరియాలు గాస్లు నీళ్లలో నాలుగు మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మరగించాలి. తరువాత వడకట్టి గోరువెచ్చగా తాగాలి. రోజులో ఇలా రెండు మూడు సార్లు తాగడం వల్ల ఇబ్బంది తగ్గుతుంది. పాలల్లోనూ మిరియాల పొడి వేసుకుని తాగొచ్చు. తులసి ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లలో మరగించాలి. నీళ్లు గోరువెచ్చగా అయ్యాక వడకట్టి పుక్కలించాలి. అలానే పసుపు కలిపిన వేడి పాలను పడుకోవాడనికి ముందు తాగాలి. ఇలా చేస్తే గొంతులో ఇన్ఫెక్షన్లు ఇట్టే దూరమవుతాయి.
బత్తాయి జ్యూస్ (Mosambi Fruit) మేలు
బత్తాయి పండుకున్న (sweet lime) తీపివాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికమయ్యేందుకు కారణమవు తుంది. ఇందుకు ప్లేవనాయిడ్లు, పిత్తరసంతో పాటు ఇతర జీర్ణరసాలు, ఆమ్లాలు విడుదలయ్యేందుకు దోహదపడతాయి. అందువల్ల మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఈ రసం త్వరగా కోలుకునేందుకు బత్తాయి రసాన్నే ఇస్తుంటారు.

బత్తాయి జ్యూస్ తాగడం వల్ల చిగుళ్లు నొప్పులు, గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లు (Throat Infection) త్వరగా తగ్గుతాయి. ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే గుండె పనితీరు మెరుగుపడుతుంది. కంటిచూపు కూడా బాగుపడుతుంది. ఇందులోని లియోనాయిడ్లు ఊపిరితిత్తుల్ని శుభ్రం చేయడంలోనూ, పరిక్షించడం లోనూ కీలక పాత్ర వహిస్తాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పాలదోలతాయి. అజీర్ణితో బాధపడేవాళ్లకు బత్తాయి రసం ఎంతో మంచిది.