throat Infection Remedies home | చాలా మంది గొంతు నొప్పి(throat Infection)తో బాధపడుతుంటారు. ఈ నొప్పిని భరించలేక చాలా సార్లు మాట్లాడలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆహారం తీసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. అలాంటి వారు ఇంటిలో తయారు(Remedies home) చేసుకునే కొన్ని పదార్థాలు ద్వారా మనకు ఉన్న గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
గొంతు సమస్యకు పూదీనా చెక్
గొంతు సమస్యతో బాధపడే వారు పుదీనా టీ(Mint tea) చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుదీనా కాలేయాన్ని శుభ్రం చేసేందుకు సహయపడుతుంది. పుదీనాలో ఉండే మెంతాల్ గీకెంజెస్టంట్ గొంతులో గరగర వంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. గొంతు నొప్పిగా ఉంటే ఓ కప్పు పుదీనా టీని తాగితే నొప్పి తగ్గుతుంది. ఇలా రోజూ తీసుకునే ఆహారంలో పుదీనా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రెండు స్పూన్ల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి రోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, విటమిన్ సి గుణాలు అధికం. ఉదయాన్నే కప్పు పుదీనా చాయ్ తాగితే దాని నుంచి శరీర పనితీరు మెరుగవుతుందని ఆర్యోగ నిపుణులు అంటున్నారు.

వెల్లుల్లితో గొంతు నొప్పి మాయం!
వెల్లుల్లి(Garlic)లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. జింజర్ మరియు హనీ టితో కూడా గొంతు నొప్పి సమస్య పోతుంది. ఈ టీలోని పవర్ ఫుల్ లక్షణాలు చాలా ఎఫెక్టివ్‌గా ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది. చికెన్ సూప్ వల్ల కూడా గొంతు నొప్పి నివారించడంలో పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న హోం రెమెడీ.
ఇది రుచికరంగా ఉండటం మాత్రమే కాదు, ఎఫెక్టివ్‌గా గొంతు నొప్పిని మాయం చేస్తుంది. ఇందులో ఇన్ఫెక్షన్స్ ను నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పు చికెన్ సూప్(chiken soup) తాగడం వల్ల గొంతు నొప్పికి కారణమయ్యే రూట్స్‌ను ఉపశమనం కలిగిస్తుంది. ఆరెంజ్ వల్ల కూడా గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఆరెంజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లను నివారించడంలో సహాయ పడుతుంది.
గొంతు గరగరా!
గొంతు ఇన్ఫెక్షన్ తగ్గాలంగే గ్లాసు వేడినీళ్లలో చెంచాడు చొప్పున దాల్చిన చెక్కా, మిరియాల పొడి కలపాలి. కాసేపయ్యాక వడకట్టుకొని పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేయడం వల్ల సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. గొంతు మంట, పట్టేసినట్టు నొప్పి విపరీతంగా బాధిస్తుంటే దాల్చిన చెక్క నూనె చెంచా తీసుకుని అందులో మరో చెంచా తేనె(honey) కలిపి తాగితే ఫలితం ఉంటుంది. వీలును బట్టి వేణ్నీళ్లలో తేనె వేసుకొని పుక్కిలించినా ఫలితం ఉంటుంది.

వెల్లుల్లుని మెత్తగా చేసి అందులో ఉప్పు, కారం కొంచెం కలిపి వేడి వేడి అన్నంలో తీసుకుంటే రుచిగా ఉంటటమే కాదు గొంతు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. అర కప్పు వేణ్నీళ్లలో చెంచా శొంఠిపొడి, అర చెంచా నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి పుక్కిలించాలి. అల్లం రసం, తేనె కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే నొప్పి, మంటా అదుపులోకి వస్తాయి. కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చి తీసుకుంటే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమస్యను త్వరగా దూరం చేస్తాయి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!