throat infection in winter చలికాలం వచ్చిందంటే చాలు దాని ప్రభావం ముందు చెవి, గొంతు, ముక్కుల మీద ఎక్కువుగా కనిపిస్తుంది. టాన్సిల్స్తో బాధపడేవాళ్లకు ఈ కాలం ఇంకా ఇబ్బంది కరం. అలాగే గొంతు నొప్పులతో బాధపడేవాళ్లకు కూడా! గొంతులో గురగుర, గొంతు బొంగురుపోవడం, గొంతు పట్టేయడం, చెవులు-ముక్కు దిబ్బెడవేయడం, తల నొప్పిలతో పాటు ముక్కు నుంచి నీరు కారడం- జలుబు లాంటి వాటితో బాధపడుతుంటారు. ఈ బాధల వల్ల చిరాకు, నీరసం, ఏ పనీ చేయలనిపించకపోవడం, శక్తి సన్నగిల్లడం, తినాలనిపించకపోవడం లాంటి ఇబ్బందులంతా కనిపిస్తాయి. ఒక్కోసారి మాట్లాడటానికి ఇబ్బంది (throat infection in winter)కావచ్చు.
అశ్రద్ధ చేయవద్దు!
సాధారణమైన గొంతు వ్యాధులు మందులతో తగ్గిపోతాయి. పెద్ద ఇబ్బందులకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం మంచిది. ఒక్కోసారి గొంతులో చీము వచ్చే ప్రమాదముంది. ఆ సమయంలో తగిన వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు వాడాల్సి ఉంటుంది. ఈ చల్లటి వాతావరణ పరిస్థితులతో బాటు కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల గొంతు సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి. దుమ్ము, ధూళి పడ్డ ఆహారాన్ని తీసుకోవద్దు. వాటి ద్వారా బాక్టీరియా లోపలకి ప్రవేశించి బాధపెడుతుంది.
జలుబుతో గొంతులో మార్పులు వచ్చినా, విపరీతంగా గొంతు నొప్పి వస్తున్నా, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, ముక్కు దిబ్బడ, చెవులు దిబ్బడ, గొంతులో కాయలు ఏర్పడటం లాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాలి. ఇ.ఎన్.టి వైద్య నిపుణుడి(ENT Doctor)కి చూపించి తగు చికిత్స చేయించుకోవాలి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు చల్లని పదార్థాలు తీసుకోవడం, అపరిశుభ్రమైన ఆహరం తీసుకోవడం, శీతల పానీయాలు తాగడం, తినే ముందు చేతులు శుభ్రపరచుకోకపోవడం లాంటి వాటివల్ల ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి(throat infection) సోకవచ్చు.

చలికాలంలో జాగ్రత్త!
అందుకని చలి బారినుంచి శరీరాన్ని కాపాడుకుంటుండాలి. చల్లటి పదార్థాలు తీసుకోవద్దు. దుమ్ముకి, ధూళికి దూరంగా ఉండాలి. అపరిశుభ్ర ఆహారం, నీళ్లు తీసుకోవద్దు. వేడి ఆహారాన్ని మాత్రమే ఈ కాలంలో తీసుకోవడం మంచిది. ఏ మాత్రం అనుమానమనిపించినా వెంటనే వైద్యుడి సలహా తీసుకోవాలి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి