Road accident: వికారాబాద్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ ధరణి కాటన్ మిల్ సమీపంలో ఎదురుగా వస్తున్న క్వాలీస్ వాహనం ఎక్సెల్ రాడ్డ్ విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న సాంట్రో కారుపైకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, రాజ లక్ష్మీ, దేవాన్షు రెడ్డిలు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?