Thotakura Health Benefits: మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని ఉన్నాయి. తరుచూ తోటకూరను తినడం వల్ల మంచి ఆరోగ్యం సొంత మవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ తోటకూర ఎందుకు తినాలి? తోటకూర వల్ల మనకు ఏం ప్రయోజనం ఉంటుందో (Thotakura Health Benefits) తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవాళ్లకు మేలు చేస్తుంది. తోటకూరలోని విటమిన్ సి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది.
తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి, గుండెకు మేలు చేసే సోడియం, పోటాషియం వంటివీ సమకూరుతాయి.విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు.

విటమిన్ ఎ, సీ, డి, ఇ, కె. విటమిన్ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరుకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి లభిస్తుంది. కార్పొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరకుతాయి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!