Third wave of Corona : భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్‌తో సతమతమవుతున్న ప్రజలకు థర్డ్‌వేవ్ భయం పట్టుకోంది. సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో కరోనా సోకిన వారు ఎంతో మంది మృత్యువాత పడ్డారు. థర్డ్‌వేవ్ వస్తే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు అందర్నీ భయాందోళనకు గురి చేస్తోంది.
Third wave of Corona : ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ వస్తుందా? ప్రస్తుతం ఈ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దేశంలో సెకండ్ వేవ్ తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. ప్రతి రోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో దేశంలో ఆందోళన తీవ్రమవుతోంది. సంపూర్ణ లాక్డౌన్ తోనే దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సంపూర్ణ లాక్‌డౌన్‌కు వ్యతిరేకమని జాతీయ మీడియా ద్వారా చాటిచెబుతోంది. దీనికి అనుగుణంగానే మోడీ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ విషయంపై పెద్దగా కఠిన నిర్ణయాలేవీ తీసుకోవడం లేదు. రాష్ట్రాలకు మాత్రం కేంద్రం సూచనలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో సెకండ్‌వేవ్ మే నెల వరకు తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని చెబుతున్నారు. ప్రపంచంలోనే కొన్ని దేశాలలో నాల్గో వేవ్ సైతం వచ్చిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో థర్డ్‌వేవ్?
ఇండియాలో థర్డ్‌వేవ్ ఈ ఏడాది నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ నెలలో రావొచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌లో థర్డ్‌వేవ్ తప్పదని కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్‌వేవ్ పిల్లలు, యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్‌వేవ్‌ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. సెకండ్‌వేవ్ నియంత్రణకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న కఠిన ఆంక్షలు, లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ థర్డ్‌వేవ్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ప్రమాదకరంగా మారిన 2021!
2020లో కరోనా వైరస్ బయటకు వచ్చినప్పటికీ అంతగా ప్రాణాంతకంగా మారలేదు. కానీ 2021లో మాత్రం కేసులు సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరిగింది. ఇక వేగంగా పిల్లలు, యువతపై ఎక్కువ ప్రభావం చూపబోతుంది. సుమారు రెండు నెలలు పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో బెడ్లన్నీ నిండిపోయాయి. కరోనా టెస్టులు చేసుకోగా ఎక్కువుగా పాజిటివ్ కేసులే నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య రుజువు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
వైరస్‌లో మ్యుటేషన్ జరిగినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువుగా ఉంటుందని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకోని జనాభాపై దాని ప్రభావం ఎక్కువుగా ఉంటుందని సమాచారం. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. పిల్లల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదం టున్నారు నిపుణులు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధ్య యనాలు కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువుగా ఉంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఒక డోసు వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత శరీరంలో ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు కేవలం 40 శాతం మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని తెలుస్తోంది. కానీ రెండు డోసులు వేసుకున్నాకే పూర్తి రక్షణ ఉంటుందంటున్నారు నిపుణులు.

కొందరిలో మొదటి డోసు తీసుకున్నాక కూడా వైరస్ సోకుతుంది. దానికి కారణం వారిలో కనిపిస్తున్న నాన్ పల్మనరీ సిస్టమిక్ ఇన్ప్లమేషన్ కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే మొదటి డోసు తీసుకున్న వారికి కరోనా సోకినా కూడా వారి ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపదని అధ్యయానాలు చెబుతున్నాయి. కానీ వారిలో జ్వరం మాత్రం ఎక్కువుగా ఉంటుందని అంటున్నారు. ఇక ఒకసారి కరోనా వైరస్ బారిని పడి కోలుకున్న వారిలో మళ్ళీ 102 రోజుల వ్యవధి తర్వాత వైరస్ సోకితే, ఇలాంటి రోగుల్లో ఏ రకం వైరస్ వల్ల కొత్త ఇన్ఫెక్షన్ సోకిందో ప్రాథమికంగా నిర్థారించుకోవాల్సి ఉంటుంది. బ్రిటన్ నుంచి వచ్చిన యుకే రకం మ్యూటెంట్ వైరస్ పిల్లలు, యువతలో ఎక్కువుగా వ్యాపిస్తోంది. బ్రెజిల్ వైరస్ అయితే మరణించే ముప్పు ఎక్కువుగా ఉంటుందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. దక్షిణాఫ్రికా రకం వైరస్ సోకితే లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడుతున్నాయి. వీరిలో క్రిటికల్ సిచ్యుయేషన్ దశకు చేరినప్పుడే లక్షణాలు బహిర్గతమవుతున్నాయి. దాంతో ప్రాణాపాయం ఎక్కువవుతోంది. సాధారణంగా వైరస్ మ్యుటేట్ జరుగుతున్నప్పుడు, వ్యాక్సినను తట్టుకుని నిలబడగలిగే శక్తి వాటికి లభిస్తోంది. దాంతో పరీక్షల్లో బయటపడదు. ఔషధాలకు లొంగని శక్తి సంతరించుకుంటుందంటున్న నిపుణులు. ఇది ప్రమాదకరమని అందుకే థర్డ్ వేవ్ వస్తే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి