love affair: చదువుకుంటున్న సమయంలో క్లాసులో ఏర్పడిన ప్రేమను పెళ్లి తర్వాత కూడా వదలకుండా కొనసాగించిన ఓ భార్య తన భర్తను హత్య చేసేందుకు వెనుకాడ లేదు. రెక్కీలు నిర్వహించి భర్తను ప్రియుడుతో హత్య చేయించింది. చివరికి కటకటాల పాలయ్యింది.
love affair: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి చేత చంపించింది ఓ మహిళ. ఆధారాల్లేకుండా తెలివిగా హత్య చేశామని అనుకున్నారు. కానీ పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో వీరి బండారం బయట పడింది. రెండ్రోజుల క్రితం విశాఖ మధురవాడలోని దుర్గానగర్‌లో రాత్రి నడకకు వెళ్లి వస్తున్న సతీష్ ను ఓ వ్యక్తి రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. అదే సమయంలో చనిపోయిన వ్యక్తితో పాటు అతని భార్య రమయ్య, పిల్లలు కూడా ఆరు అడుగుల దూరంలో ముందు నడుస్తున్నారు.
రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే సతీష్ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో భార్య పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. సతీష్ భార్య రమ్య ఫిర్యాదులో తన భర్తపై దాడికి పాల్పడుతున్న సమయంలో తాను ఆరు అడుగుల దూరంలో ఉన్నానని చెప్పడం, ఆ సమయంలో ఆమె ప్రతిఘటించకపోవడం పట్ల పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజం బయట పెట్టింది.
మొదట తన భర్తకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వేరే వ్యక్తితో గొడవలు ఉన్నాయని పోలీసులను పక్కదారి పట్టించింది. హత్యకు రెండ్రోజుల ముందే ప్రియుడు షేక్ బాషాతో కలిసి రమ్య రెక్కీ నిర్వహించింది. సీసీ కెమెరాలు లేని, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని నిందితులు హత్యకు పాల్పడినట్టు డీసీపీ గౌతమిశాలి మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులిద్దరూ స్కూల్ నాటి నుంచి స్నేహితులుగా ఉంటూ ప్రేమ వ్యవహారం నడిపించారని తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత పదో తరగతి స్నేహితుల వాట్సాప్ గ్రూప్ ద్వారా తిరిగి వీరు ఒక్కటయ్యారని డీసీపీ తెలిపారు.
తమ బంధానికి అడ్డుగా ఉన్న సతీష్‌ను అడ్డు తొలగించుకుని తాము ఒక్కటవ్వాలని రమ్య, బాషా పథకం వేశారు. అదే విధంగా హత్యకు పాల్పడినట్టు డీసీపీ వివరించారు. నిందితులిద్దర్నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!