New COVID Strain : కొత్త స్ట్రెయిన్లతో ముప్పు..అప్రమత్తమైన కేంద్రం
New COVID Strain : Delhi: కరోనా కొత్త స్ట్రెయిన్లు భారత్ ను భయపెడుతున్నాయి. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో పుట్టిన కరోనా కొత్త స్ట్రెయిన్లు ఇప్పుడు భారతదేశంలోనూ ప్రవేశించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇక నుంచి విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణీకులకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులు ప్రయాణానికి 72 గంటల ముందుగా చేయించుకున్న కరోనా ఆర్టీ -పీసాఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ను ఎయిర్ సువిదా పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఎయిర్ పోర్టు లోపల నిర్వహించే థర్మల్ స్క్రీనింగ్ లో కరోనా లక్షణాలు లేకపోతేనే విమానం ఎక్కేందుకు అనుమతి ఉంటుంది. యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్ నుంచి మొదలయ్యే విమానాల ద్వారా నేరుగా భారత్ కు వచ్చే ప్రయాణీకులను మాత్రం ఈ మార్గదర్శకాల నుంచి మినహాయిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. కాకపోతే వీరు ప్రయాణానికి ముందు 14 రోజుల ట్రావెల్ హిస్టరీని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా భారత్ కు చేరుకున్నాక వీరంతా తమ సొంత ఖర్చులతో ఎయిర్ పోర్టులో కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ఫిబ్రవరి 22 రాత్రి 11.59 నిమిషాల నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర విమానాయణ శాఖ వెల్లడించింది.
ఇది చదవండి:హత్యలు వెనుక టిఆర్ఎస్ పాత్ర: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ఇది చదవండి:మనిషి మాంసం తినే తెగ గురించి తెలుసా?
ఇది చదవండి:జీతాల్లేవు..భద్రత లేదు!
ఇది చదవండి:తెలంగాణ కోడలను నేను.. విమర్శకులకు షర్మిలా సమాధానం!
ఇది చదవండి:పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
ఇది చదవండి: కేసీఆర్ ఒక విలన్: భట్టి విక్రమార్క
ఇది చదవండి:తమిళ స్మగ్లర్ అరెస్టు
ఇది చదవండి:అన్నం తిన్నొచ్చే లోపులో విషాదం మిగిలింది!